ఆఁటదాన నవుట తప్పా అంతేకాదా
(॥పల్లవి॥)
ఆఁటదాన నవుట తప్పా అంతేకాదా
ఆటపాటలాయ బదు కంతేకాదా
(॥ఆట॥)
కొంగువట్టి తియ్యఁగాను గోరుదాఁకి యిందరిలో
అంగమెల్లాఁ బులకించె నంతేకాదా
వుంగిటిగా మగనాలి కుండరాదా వూరి లోన
అంగభంగాలఁబెట్టెవు అంతేకాదా
(॥ఆట॥)
మేరమీరి నగఁగాను మీఁదమీఁద జెక్కులెల్లా
ఆరితేరి చెమరించె నంతేకాదా
వూరికే వోయమ్మ నీకు వుండవయ్య వెఱతుము
ఆరవితాప మందించే వంతేకాదా
(॥ఆట॥)
ఆకుమడిచి కొమ్మంటా ఆనవెట్టే వండనుండి
ఆకడివారు చూచేరు అంతేకాదా
చేకొని శ్రీవేంకటేశ చేయిమీరి కూడితివి
ఆకెసుద్దులు చెప్పేవు అంతేకాదా
(||pallavi||)
ām̐ṭadāna navuḍa tappā aṁtegādā
āḍabāḍalāya badu kaṁtegādā
(||āḍa||)
kŏṁguvaṭṭi tiyyam̐gānu gorudām̐ki yiṁdarilo
aṁgamĕllām̐ bulagiṁchĕ naṁtegādā
vuṁgiḍigā maganāli kuṁḍarādā vūri lona
aṁgabhaṁgālam̐bĕṭṭĕvu aṁtegādā
(||āḍa||)
meramīri nagam̐gānu mīm̐damīm̐da jĕkkulĕllā
ārideri sĕmariṁchĕ naṁtegādā
vūrige voyamma nīgu vuṁḍavayya vĕṟadumu
āravidāba maṁdiṁche vaṁtegādā
(||āḍa||)
āgumaḍisi kŏmmaṁṭā ānavĕṭṭe vaṁḍanuṁḍi
āgaḍivāru sūseru aṁtegādā
segŏni śhrīveṁkaḍeśha seyimīri kūḍidivi
āgĕsuddulu sĕppevu aṁtegādā