(॥పల్లవి॥)
ఆఁటదాన మోదలనే అంత దంటనా
యేఁటికి నవ్వేవు నిన్ను యే మనఁగఁగలను
(॥ఆఁట॥)
మంతనము లాడఁగానే మాటలు నమ్మితిఁ గాని
యింత సేతువని నే నెరఁగఁ దొల్లి
బతికిఁ బిలువగానే భ్రమసి వచ్చితిఁ గాని
వింత నీ బుద్ధులెల్లాను వినఁదొల్లి
(॥ఆఁట॥)
బగి వాయుకుండఁగానే పట్టి పెనఁగితిఁ గాని
తెగనినీజోలి యౌట తెలియఁ దొల్లి
మోగము చూడఁగ నీముందరనే వుంటిఁ గాని
వెగటైననీగుణము విచారించఁ దొల్లి
(॥ఆఁట॥)
చెయి వట్టి తియ్యఁగానే సిగ్గున నే నుంటిఁగాని
నయగారా లిని చూడ నాలోనఁ దొల్లి
దయతో శ్రీవేంకటేశ తగ మన్నించితి విట్టె
నియతాన నెదురాడ నీతోఁ దొల్లి
(||pallavi||)
ām̐ṭadāna modalane aṁta daṁṭanā
yem̐ṭigi navvevu ninnu ye manam̐gam̐galanu
(||ām̐ṭa||)
maṁtanamu lāḍam̐gāne māḍalu nammidim̐ gāni
yiṁta seduvani ne nĕram̐gam̐ dŏlli
badigim̐ biluvagāne bhramasi vachchidim̐ gāni
viṁta nī buddhulĕllānu vinam̐dŏlli
(||ām̐ṭa||)
bagi vāyuguṁḍam̐gāne paṭṭi pĕnam̐gidim̐ gāni
tĕganinījoli yauḍa tĕliyam̐ dŏlli
mogamu sūḍam̐ga nīmuṁdarane vuṁṭim̐ gāni
vĕgaḍainanīguṇamu visāriṁcham̐ dŏlli
(||ām̐ṭa||)
sĕyi vaṭṭi tiyyam̐gāne sigguna ne nuṁṭim̐gāni
nayagārā lini sūḍa nālonam̐ dŏlli
dayado śhrīveṁkaḍeśha taga manniṁchidi viṭṭĕ
niyadāna nĕdurāḍa nīdom̐ dŏlli