Aampalega kosaridi namtiyagaaga

ఆఁపలేక కొసరితి నంతియకాక
Language

(॥పల్లవి॥)
ఆఁపలేక కొసరితి నంతియకాక
పైపై నిన్నింత వొడఁబరచఁగవలెనా

(॥॥)
తలఁపులో తమకము దాఁచ నలవిగాక
చెలరేఁగి విన్నపము చేసితిఁగాక
మలసి నీయంత నీవు మన్నించవా నన్ను
నెలకొన్న నావలపు నీ వెరఁగనిదా

(॥॥)
తనువు పై జవ్వనమదము వారించఁగరాక
వొనర నాచన్నుల నిన్నొ త్తితిఁగాక
ననుపుతో చనవులు నాఁడే నాకియ్యవా
నిను పైననావునికి చూడనిదా

(॥॥)
వెసఁ గాఁగిటిలో రతివేడుక వసముగాక
పసలుగా నిన్నుఁ గూడి పై కొంటిఁగాక
పొఁసగ శ్రీ వేంకటేశ భోగము నాకియ్యవా
యెసగ నా గుణము నీవిటు సోదించనిదా

(||pallavi||)
ām̐palega kŏsaridi naṁtiyagāga
paibai ninniṁta vŏḍam̐barasam̐gavalĕnā

(||||)
talam̐pulo tamagamu dām̐sa nalavigāga
sĕlarem̐gi vinnabamu sesidim̐gāga
malasi nīyaṁta nīvu manniṁchavā nannu
nĕlagŏnna nāvalabu nī vĕram̐ganidā

(||||)
tanuvu pai javvanamadamu vāriṁcham̐garāga
vŏnara nāsannula ninnŏ ttidim̐gāga
nanubudo sanavulu nām̐ḍe nāgiyyavā
ninu painanāvunigi sūḍanidā

(||||)
vĕsam̐ gām̐giḍilo radiveḍuga vasamugāga
pasalugā ninnum̐ gūḍi pai kŏṁṭim̐gāga
pŏm̐saga śhrī veṁkaḍeśha bhogamu nāgiyyavā
yĕsaga nā guṇamu nīviḍu sodiṁchanidā