Aammaro yemtadi saahasive neevu

ఆమ్మరో యెంతటి సాహసివే నీవు
Language

(॥పల్లవి॥)
ఆమ్మరో యెంతటి సాహసివే నీవు
కమ్మర నాతఁడే నిన్నుఁ గరుణించీఁ గాక

(॥అమ్మ॥)
వుడివోని వలపులు వొడిఁగట్టుకొని వుండి
జడియక పతినెంత జంకించేవే
చిడుముడిఁ దలఁబాలు శిరసు పైఁ బెట్టుకుండి
బడిబడి నతనితో పంతాలే లాడేవే

(॥అమ్మ॥)
గట్టిగా నీతమకము గాదెలఁ బోసుకువుండి
అట్టె బింకాన నెంత యద్దనించేవే
మట్టులేని కోరికలు మనసులోఁ బెట్టుకుండి
నెట్టన నాతనినేల నేరము లెంచేవే

(॥అమ్మ॥)
సమరతి జవ్వనము చన్నులపైఁ బెట్టుకుండి
కొమరెవు యిఁకనేల గుట్టుసేసేవే
అమర శ్రీవేంకటేశుఁ డంతలోనె నిన్నుఁ గూడె
తిమిరి యతని నెంత దిష్టంచి చూచేవే

(||pallavi||)
āmmaro yĕṁtaḍi sāhasive nīvu
kammara nādam̐ḍe ninnum̐ garuṇiṁchīm̐ gāga

(||amma||)
vuḍivoni valabulu vŏḍim̐gaṭṭugŏni vuṁḍi
jaḍiyaga padinĕṁta jaṁkiṁcheve
siḍumuḍim̐ dalam̐bālu śhirasu paim̐ bĕṭṭuguṁḍi
baḍibaḍi nadanido paṁtāle lāḍeve

(||amma||)
gaṭṭigā nīdamagamu gādĕlam̐ bosuguvuṁḍi
aṭṭĕ biṁkāna nĕṁta yaddaniṁcheve
maṭṭuleni korigalu manasulom̐ bĕṭṭuguṁḍi
nĕṭṭana nādaninela neramu lĕṁcheve

(||amma||)
samaradi javvanamu sannulabaim̐ bĕṭṭuguṁḍi
kŏmarĕvu yim̐kanela guṭṭuseseve
amara śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalonĕ ninnum̐ gūḍĕ
timiri yadani nĕṁta diṣhṭaṁchi sūseve