Aamkali gomtivigaa ayyo nee momella vaade

ఆఁకలి గొంటివిగా అయ్యో నీ మోమెల్ల వాడె
Language

(॥పల్లవి॥)
ఆఁకలి గొంటివిగా అయ్యో నీ మోమెల్ల వాడె
కాఁకల నిన్నుఁ దిప్పిరి కడనున్న చెలులు

(॥ఆఁక॥)
ఆపెసుద్దులే చెప్పి అట్టె నిన్నుఁబొద్దు వుచ్చి
పాపజాతిచెలు లెల్లా భ్రమయించిరి
యేపున ని న్నింతసేసి యింటికి రాయ్యరైరి
పై పైఁ జలారె నిదె పట్టినట్టిబోనము

(॥ఆఁక॥)
చక్కఁదనాలు వొగడి నతిమీఁదఁ థమిరేఁచి
చిక్కించిరి కట్టడియాచెలులు నిన్ను
నెక్కొని నిన్నించుకంత నిద్దిరించ నియ్యరైరి
వెక్కసాన భోగించేటివేళ లెల్లఁ దపను

(॥ఆఁక॥)
నవ్వుల వల పెక్కించి నలినాక్షిమోము చూపి
దవ్వులనే చెలులెల్ల దక్కించిరిగా
రవ్వగా శ్రీవేంకటేశ రానన్నా నన్నుఁగూడితి
వువ్విళ్ళూరఁ గెమ్మోని వొక్కటే మారతులా

(||pallavi||)
ām̐kali gŏṁṭivigā ayyo nī momĕlla vāḍĕ
kām̐kala ninnum̐ dippiri kaḍanunna sĕlulu

(||ām̐ka||)
ābĕsuddule sĕppi aṭṭĕ ninnum̐bŏddu vuchchi
pābajādisĕlu lĕllā bhramayiṁchiri
yebuna ni nniṁtasesi yiṁṭigi rāyyarairi
pai paim̐ jalārĕ nidĕ paṭṭinaṭṭibonamu

(||ām̐ka||)
sakkam̐danālu vŏgaḍi nadimīm̐dam̐ thamirem̐si
sikkiṁchiri kaṭṭaḍiyāsĕlulu ninnu
nĕkkŏni ninniṁchugaṁta niddiriṁcha niyyarairi
vĕkkasāna bhogiṁcheḍiveḽa lĕllam̐ dabanu

(||ām̐ka||)
navvula vala pĕkkiṁchi nalinākṣhimomu sūbi
davvulane sĕlulĕlla dakkiṁchirigā
ravvagā śhrīveṁkaḍeśha rānannā nannum̐gūḍidi
vuvviḽḽūram̐ gĕmmoni vŏkkaḍe māradulā