Aamkaleramgaru appadinumdiyu

ఆఁకలెరఁగరు అప్పటినుండియు
Language

(॥పల్లవి॥)
ఆఁకలెరఁగరు అప్పటినుండియు
తేఁకువ బోనాలు దెచ్చితిమిదివో

(॥ఆఁక॥)
మచ్చిక చూపులు మంతనాలాడేరు
యిచ్చటనే తామిద్దరును
హెచ్చి నిన్న మొన్ననేమి సేసిరొకో
పొచ్చపుచేఁతల పొద్దులువోయ

(॥ఆఁక॥)
చనవు మెరసి సన్నలు సేసేరు
యెనసి లోలోనె యిద్దరును
మనసులిందాఁకా మరచి యెట్టుండిరొ
వినేసతులకు వేసటలాయ

(॥ఆఁక॥)
నిండుఁగాఁగిటనె నివ్వెరగందేరు
యెండ నీడెరఁగక యిద్దరును
పండి శ్రీవెంకటపతి యలమేల్ మంగ
వుండనుండ భోగమొద్దికలాయ

(||pallavi||)
ām̐kalĕram̐garu appaḍinuṁḍiyu
tem̐kuva bonālu dĕchchidimidivo

(||ām̐ka||)
machchiga sūbulu maṁtanālāḍeru
yichchaḍane tāmiddarunu
hĕchchi ninna mŏnnanemi sesirŏgo
pŏchchabusem̐tala pŏdduluvoya

(||ām̐ka||)
sanavu mĕrasi sannalu seseru
yĕnasi lolonĕ yiddarunu
manasuliṁdām̐kā marasi yĕṭṭuṁḍirŏ
vinesadulagu vesaḍalāya

(||ām̐ka||)
niṁḍum̐gām̐giḍanĕ nivvĕragaṁderu
yĕṁḍa nīḍĕram̐gaga yiddarunu
paṁḍi śhrīvĕṁkaḍabadi yalamel maṁga
vuṁḍanuṁḍa bhogamŏddigalāya