Aamduvaaru kadum gobu lavuda nee veṟumgavaa

ఆఁడువారు కడుఁ గోపు లవుట నీ వెఱుఁగవా
Language

(॥పల్లవి॥)
ఆఁడువారు కడుఁ గోపు లవుట నీ వెఱుఁగవా
నేఁడు గొత్తలుగా బూమి నేర్చుక వచ్చేరా

(॥ఆఁడు॥)
వలచినఁడువారు వాదులాటకు వచ్చిన
చలము సాదించువాఁడు జాణఁడా వాఁడు
కలయ నీరాకతోడ కమ్మటి నీలిగి పోఁగా
పిలిచి మాటాడకున్న ప్రియుడా వాఁడు

(॥ఆఁడు॥)
చనవు గలుగువారు సణఁగులఁ దిట్టఁ గాను
కనలి యెగ్గువట్టితే ఘనుఁడా వాఁడు
గునిసి సవతులపై కోపాన పతి నంటేను
విని నవ్వకుండేవాఁడు విభుఁడా వాఁడు

(॥ఆఁడు॥)
పాయరానియట్టివారు బలుములు చూసితేను
నాయాలఁ బెట్టెడివాఁడు నాథుఁడా వాఁడు
యీయెడ శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి
చాయకు రాకుండువాఁడు సరసుఁడా వాఁడు

(||pallavi||)
ām̐ḍuvāru kaḍum̐ gobu lavuḍa nī vĕṟum̐gavā
nem̐ḍu gŏttalugā būmi nersuga vachcherā

(||ām̐ḍu||)
valasinam̐ḍuvāru vādulāḍagu vachchina
salamu sādiṁchuvām̐ḍu jāṇam̐ḍā vām̐ḍu
kalaya nīrāgadoḍa kammaḍi nīligi pom̐gā
pilisi māḍāḍagunna priyuḍā vām̐ḍu

(||ām̐ḍu||)
sanavu galuguvāru saṇam̐gulam̐ diṭṭam̐ gānu
kanali yĕgguvaṭṭide ghanum̐ḍā vām̐ḍu
gunisi savadulabai kobāna padi naṁṭenu
vini navvaguṁḍevām̐ḍu vibhum̐ḍā vām̐ḍu

(||ām̐ḍu||)
pāyarāniyaṭṭivāru balumulu sūsidenu
nāyālam̐ bĕṭṭĕḍivām̐ḍu nāthum̐ḍā vām̐ḍu
yīyĕḍa śhrīveṁkaḍeśha yiṁti niṭṭĕ kūḍidivi
sāyagu rāguṁḍuvām̐ḍu sarasum̐ḍā vām̐ḍu