ఆఁడువారిఁ గంటేఁజాలు ఆస నీకెంతైనాఁ గద్దు
(॥పల్లవి॥)
ఆఁడువారిఁ గంటేఁజాలు ఆస నీకెంతైనాఁ గద్దు
పోడిమితోఁ మమ్మంటేవు పొద్దువోదా నీకు
(॥ఆఁడు॥)
యెచ్చిన తమకముతో నెదురులు చూచుకొంటా
కచ్చు పెంటి నీకు నాపె గాచుకున్నది
మచ్చికజాణతనాలు మాతో నేమి యాడేవు
అచ్చముగా మాతోపొందు లంతేసి కోపుదువా
(॥ఆఁడు॥)
కందువ నిన్నుఁ బెండ్లాడి కాఁపురము సే సేనంటా
పొందులకు నీతో నాపె వూఁచుకున్నది
చెంది మా చన్నులమీఁద చేతులేమి చాఁచేవు
అందముగ మాతో పొందు లంతేసి కోపుదువా
(॥ఆఁడు॥)
వేడుక నలమేల్మంగవిభుఁడు శ్రీవేంకటేశ
కూడేనంటా నాపె నిన్నుఁ గోరుకున్నది
వాడికగా మమ్ము నీడ వలపించి యేలితివి
ఆడుకోలు మాతోపొందు లంతేసి కోపుదువా
(||pallavi||)
ām̐ḍuvārim̐ gaṁṭem̐jālu āsa nīgĕṁtainām̐ gaddu
poḍimidom̐ mammaṁṭevu pŏdduvodā nīgu
(||ām̐ḍu||)
yĕchchina tamagamudo nĕdurulu sūsugŏṁṭā
kachchu pĕṁṭi nīgu nābĕ gāsugunnadi
machchigajāṇadanālu mādo nemi yāḍevu
achchamugā mādobŏṁdu laṁtesi kobuduvā
(||ām̐ḍu||)
kaṁduva ninnum̐ bĕṁḍlāḍi kām̐puramu se senaṁṭā
pŏṁdulagu nīdo nābĕ vūm̐sugunnadi
sĕṁdi mā sannulamīm̐da sedulemi sām̐sevu
aṁdamuga mādo pŏṁdu laṁtesi kobuduvā
(||ām̐ḍu||)
veḍuga nalamelmaṁgavibhum̐ḍu śhrīveṁkaḍeśha
kūḍenaṁṭā nābĕ ninnum̐ gorugunnadi
vāḍigagā mammu nīḍa valabiṁchi yelidivi
āḍugolu mādobŏṁdu laṁtesi kobuduvā