ఆఁడువారి గుణ మిది యటువంటిదాన గాను
(॥పల్లవి॥)
ఆఁడువారి గుణ మిది యటువంటిదాన గాను
నేఁడు నన్నేలుకో వారు నిన్ను దూరఁజూతురు
(॥॥)
మట మాయతనమున మగువలు మగవారి
సటకారితనమున సాదింతురు
తటుకన వలచితేఁ దగిలించుకొని యట్టె
యిటునటు భ్రమయించి యెలయించఁ జూతురు
(॥॥)
వేసదావరినితలు వెంగెము లప్పటిఁ జూపి
కాసువీసములకుఁగా గరఁగింతురు
ఆసపడి లోనైతే నందవాయకుండాఁ జేసి
బాసగొని మోసపుచ్చి పంతమాడఁ జూతురు
(॥॥)
యేతులాఁడికాంతలు యెందునైనా సందుచూచి
వాతరొట్టుమాట లాడి వంచుకొందురు
యీతల శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
చేతఁ జిక్కుకున్న వారు సిగ్గువడఁ జూతురు
(||pallavi||)
ām̐ḍuvāri guṇa midi yaḍuvaṁṭidāna gānu
nem̐ḍu nannelugo vāru ninnu dūram̐jūduru
(||||)
maḍa māyadanamuna maguvalu magavāri
saḍagāridanamuna sādiṁturu
taḍugana valasidem̐ dagiliṁchugŏni yaṭṭĕ
yiḍunaḍu bhramayiṁchi yĕlayiṁcham̐ jūduru
(||||)
vesadāvarinidalu vĕṁgĕmu lappaḍim̐ jūbi
kāsuvīsamulagum̐gā garam̐giṁturu
āsabaḍi lonaide naṁdavāyaguṁḍām̐ jesi
bāsagŏni mosabuchchi paṁtamāḍam̐ jūduru
(||||)
yedulām̐ḍigāṁtalu yĕṁdunainā saṁdusūsi
vādarŏṭṭumāḍa lāḍi vaṁchugŏṁduru
yīdala śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
sedam̐ jikkugunna vāru sigguvaḍam̐ jūduru