Aamduvaari gora sesi amduraa neevu

ఆఁడువారి గోర సేసి అందురా నీవు
Language

(॥పల్లవి॥)
ఆఁడువారి గోర సేసి అందురా నీవు
నేఁడు నీ మేలుకుఁ జొక్కి నెమ్మది నుండితిని

(॥ఆఁడు॥)
యిన్నిటా జాణఁడ వని యిచ్చకుఁడ వౌదు వని
మొన్ననే చూచి నీకు మొక్కనా నేను
నన్ను నేల దూరేవు నగి నిన్ను మెచ్చనంటా
పన్నిన నీరతిచేతఁ బరవశ మైతిని

(॥ఆఁడు॥)
తప్పవు నీమాఁట లని తగు మంచివాఁడ వని
అప్పుడె నీచెక్కు గోర నంట నానేను
తప్పులేల యెంచేవు తగిలి పొగడనంటా
నెప్పున నీ ప్రియానకు నివ్వెర గందితిని

(॥ఆఁడు॥)
కత కరచితి వని కాఁగిటఁ గూడితి వని
యితవుతో నీవుర మెక్కనా నేను
గతియై శ్రీవేంకటేశ కాఁగిటఁ గూడితి నన్ను
తతి నీ గుణాలఁ జిక్కి తమక మందితిని

(||pallavi||)
ām̐ḍuvāri gora sesi aṁdurā nīvu
nem̐ḍu nī melugum̐ jŏkki nĕmmadi nuṁḍidini

(||ām̐ḍu||)
yinniḍā jāṇam̐ḍa vani yichchagum̐ḍa vaudu vani
mŏnnane sūsi nīgu mŏkkanā nenu
nannu nela dūrevu nagi ninnu mĕchchanaṁṭā
pannina nīradisedam̐ baravaśha maidini

(||ām̐ḍu||)
tappavu nīmām̐ṭa lani tagu maṁchivām̐ḍa vani
appuḍĕ nīsĕkku gora naṁṭa nānenu
tappulela yĕṁchevu tagili pŏgaḍanaṁṭā
nĕppuna nī priyānagu nivvĕra gaṁdidini

(||ām̐ḍu||)
kada karasidi vani kām̐giḍam̐ gūḍidi vani
yidavudo nīvura mĕkkanā nenu
gadiyai śhrīveṁkaḍeśha kām̐giḍam̐ gūḍidi nannu
tadi nī guṇālam̐ jikki tamaga maṁdidini