ఆఁడువార మే మనేము అట్టె నీ వేమి సేసినా
(॥పల్లవి॥)
ఆఁడువార మే మనేము అట్టె నీ వేమి సేసినా
నేఁడు పుణ్యపాపాలు నీ చేతిది గాకా
(॥ఆడు॥)
నగుతానె ఆపెనూ నన్నునూ వాదులు వెట్టి
పగ సాదించితిగా పంతగాఁడా
తగవులు చెప్పె నంటా దగ్గరించి మావలపు
తగిలించుకొంటివి గా తక్కరికాఁడా
(॥ఆడు॥)
మచ్చిక నే మాడెటిమాటలు వేలుచుకొని
కుచ్చితాలు సేసితిగా కొయ్యకాఁడా
కొచ్చి కొచ్చి నీ మీఁదఁ గోరి యాన లెల్లాఁ బెట్టి
తెచ్చితిగా నీయింటికి దిమ్మరీఁడా
(॥ఆడు॥)
వాసులు మాకు నెక్కించి వద్దఁ బాయకుండఁ జేసి
సేసలు వెట్టితివిగా సిగ్గరీఁడా
ఆసల శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
నాసరి నాకెఁ గూడితి నాఁటకీఁడా
(||pallavi||)
ām̐ḍuvāra me manemu aṭṭĕ nī vemi sesinā
nem̐ḍu puṇyabābālu nī sedidi gāgā
(||āḍu||)
nagudānĕ ābĕnū nannunū vādulu vĕṭṭi
paga sādiṁchidigā paṁtagām̐ḍā
tagavulu sĕppĕ naṁṭā daggariṁchi māvalabu
tagiliṁchugŏṁṭivi gā takkarigām̐ḍā
(||āḍu||)
machchiga ne māḍĕḍimāḍalu velusugŏni
kuchchidālu sesidigā kŏyyagām̐ḍā
kŏchchi kŏchchi nī mīm̐dam̐ gori yāna lĕllām̐ bĕṭṭi
tĕchchidigā nīyiṁṭigi dimmarīm̐ḍā
(||āḍu||)
vāsulu māgu nĕkkiṁchi vaddam̐ bāyaguṁḍam̐ jesi
sesalu vĕṭṭidivigā siggarīm̐ḍā
āsala śhrīvĕṁkaḍeśha alamelumaṁga nenu
nāsari nāgĕm̐ gūḍidi nām̐ṭagīm̐ḍā