ఆఁడుజన్మమే మాకు నాఱడాయనో కాక
(॥పల్లవి॥)
ఆఁడుజన్మమే మాకు నాఱడాయనో కాక
పోఁడిమిఁ దా మగవాఁడు భువిఁ బచ్చి సేతురా
(॥ఆడు ॥)
ముంచుకొని మగవారు ము0గిటనే వుండఁగాను
మంచము చప్పుడుసేసీ మాకు నిదెక్కడికాకే
యెంచఁ బొరుగు వినఁగ నేడగొడవమ్మ మాకు
పొ0చి పటుకురనఁగఁ బోఁకఁ గొరికీని
(॥ఆడు॥)
చక్కఁ బొద్దుగుంక దిదె సతులెల్లనవ్వఁగాను
పక్కనఁ దలుపు మూసీఁ బనో మరి
యెక్కువతోఁ జింటిబిడ్డ లిదె చేయి దిగరు తా-
నక్కరతోఁ గొంగువట్టీ నౌనే లెస్సాయను
(॥ఆడు॥)
యెలిమితో నత్త మామ లెదుటనే వుండఁగాను
చలాలకే మాటలాడీ సంగతెఱఁగఁడే వీఁడు
అలరి శ్రీవేంకటేశుఁ డందరి మొరఁగి కూడె
తలఁగ కింతేసిరట్టు తగునా ఇల్లాలికి
(||pallavi||)
ām̐ḍujanmame māgu nāṟaḍāyano kāga
pom̐ḍimim̐ dā magavām̐ḍu bhuvim̐ bachchi sedurā
(||āḍu ||)
muṁchugŏni magavāru mu0giḍane vuṁḍam̐gānu
maṁchamu sappuḍusesī māgu nidĕkkaḍigāge
yĕṁcham̐ bŏrugu vinam̐ga neḍagŏḍavamma māgu
pŏ0chi paḍuguranam̐gam̐ bom̐kam̐ gŏrigīni
(||āḍu||)
sakkam̐ bŏdduguṁka didĕ sadulĕllanavvam̐gānu
pakkanam̐ dalubu mūsīm̐ bano mari
yĕkkuvadom̐ jiṁṭibiḍḍa lidĕ seyi digaru tā-
nakkaradom̐ gŏṁguvaṭṭī naune lĕssāyanu
(||āḍu||)
yĕlimido natta māma lĕduḍane vuṁḍam̐gānu
salālage māḍalāḍī saṁgadĕṟam̐gam̐ḍe vīm̐ḍu
alari śhrīveṁkaḍeśhum̐ ḍaṁdari mŏram̐gi kūḍĕ
talam̐ga kiṁtesiraṭṭu tagunā illāligi