Aamdu janmame melu amdarigini

ఆఁడు జన్మమే మేలు అందరికిని
Language

(॥పల్లవి॥)
ఆఁడు జన్మమే మేలు అందరికిని
పోఁడిమితో నీవంటి పురుషుఁ డుండఁగను

(॥ఆఁడు॥)
గోపికల కొరకె కొండ గొడ గెత్తితివి
గోపికల కొరకె గోవులనుఁ గాచితివి
యీపాటి వాఁడవు ఇంతులఁ గంటేఁ జాలు
యేపనియైనాఁ జేతువు యెరిఁగితిమయ్య

(॥ఆఁడు॥)
పొంచి సత్యభామకుఁగా పువ్వులమాఁకు మోఁచితి
పొంచి సత్యభామవద్ద పోటుబంటవై మించితి
ఇంచుకంతా లోఁగవు ఇంతు లొద్దనుంటేఁ జాలు
యెంచ కన్నియుఁ జేతువు యెరిఁగితిమయ్య

(॥ఆఁడు॥)
మిన్ను సాదించి తెచ్చితి మెరసి పదారువేల
మిన్నునేలఁ గూడపెట్టి మించి రుక్మిణిఁ జేకొంటి
ఇన్నిటా శ్రీ వేంకటేశ ఇరవైతివి మాపాల
యెన్నియైనాఁ జేతువు నిన్నెరిఁగితిమయ్యా

(||pallavi||)
ām̐ḍu janmame melu aṁdarigini
pom̐ḍimido nīvaṁṭi puruṣhum̐ ḍuṁḍam̐ganu

(||ām̐ḍu||)
gobigala kŏragĕ kŏṁḍa gŏḍa gĕttidivi
gobigala kŏragĕ govulanum̐ gāsidivi
yībāḍi vām̐ḍavu iṁtulam̐ gaṁṭem̐ jālu
yebaniyainām̐ jeduvu yĕrim̐gidimayya

(||ām̐ḍu||)
pŏṁchi satyabhāmagum̐gā puvvulamām̐ku mom̐sidi
pŏṁchi satyabhāmavadda poḍubaṁṭavai miṁchidi
iṁchugaṁtā lom̐gavu iṁtu lŏddanuṁṭem̐ jālu
yĕṁcha kanniyum̐ jeduvu yĕrim̐gidimayya

(||ām̐ḍu||)
minnu sādiṁchi tĕchchidi mĕrasi padāruvela
minnunelam̐ gūḍabĕṭṭi miṁchi rukmiṇim̐ jegŏṁṭi
inniḍā śhrī veṁkaḍeśha iravaidivi mābāla
yĕnniyainām̐ jeduvu ninnĕrim̐gidimayyā