ఆమనిపువ్వువంటిది ఆయమైన వయసు
(॥పల్లవి॥)
ఆమనిపువ్వువంటిది ఆయమైన వయసు
కామించి భోగించక యా(యే?)మరఁదగునా
(॥ఆమ॥)
చలపాదితనమేల సణఁగులాడఁగనేల
బలిమిఁ బెనఁగేయట్టి పతితోను
పలుకరాదా కప్రపుబాగా లియ్యఁగరాదా
చెలులకు నింతేసి సిగ్గువడఁదగునా
(॥ఆమ॥)
బిగియఁగ నింతయేల పెచ్చువెరుగఁగనేల
పగటునఁ దమకించే పతితోను
నగవులు నగరాదా నయములు చూపరాదా
చిగురుమోవితోడ సిగ్గువడఁదగునా
(॥ఆమ॥)
మరిగించ నింతయేల మనసులు చూడనేల
పరగ శ్రీ వేంకటపతితోను
గరిమెల మెచ్చరాదా కాఁగిటఁగూడె నతఁడు
శిరసువంచుక యట్టె సిగ్గువడఁదగునా
(||pallavi||)
āmanibuvvuvaṁṭidi āyamaina vayasu
kāmiṁchi bhogiṁchaga yā(ye?)maram̐dagunā
(||āma||)
salabādidanamela saṇam̐gulāḍam̐ganela
balimim̐ bĕnam̐geyaṭṭi padidonu
palugarādā kaprabubāgā liyyam̐garādā
sĕlulagu niṁtesi sigguvaḍam̐dagunā
(||āma||)
bigiyam̐ga niṁtayela pĕchchuvĕrugam̐ganela
pagaḍunam̐ damagiṁche padidonu
nagavulu nagarādā nayamulu sūbarādā
sigurumovidoḍa sigguvaḍam̐dagunā
(||āma||)
marigiṁcha niṁtayela manasulu sūḍanela
paraga śhrī veṁkaḍabadidonu
garimĕla mĕchcharādā kām̐giḍam̐gūḍĕ nadam̐ḍu
śhirasuvaṁchuga yaṭṭĕ sigguvaḍam̐dagunā