Aaligi maganigini amarenu valabulu

ఆలికి మగనికిని అమరెను వలపులు
Language

(॥పల్లవి॥)
ఆలికి మగనికిని అమరెను వలపులు
వాలాయపు పొందు లిటువలె నుండవలదా

(॥ఆలి॥)
యీడుజొడై తమలోన యెగ్గుదప్పు లెంచుకోరు
ఆడు కోలు మాటలు అవి యెట్టివో
వాడికసంతోసాలు వదల రెంతై నాను
వేడుకఁ గూడినయట్టివేళ లెటువంటివో

(॥ఆలి॥)
సరసములాడుకొంటా జంటవాయ రెన్నఁడును
ఇరవైనపొంతనాలు యెట్టు గూడెనో
మరిగి యొకరొకరు మనసుల నెఁతైనాను
యెరపరిక మెఱఁగ రేమినోము నోఁచిరో

(॥ఆలి॥)
వేమారు రతులఁ గూడి వీసమంతా నలయరు
ప్రేమతో నేసగినానఁ బెండ్లాడిరో
ఆముక శ్రీవేంకటేశుఁ డలు మేలుమంగ యీకె
యేమిటా నొద్దికమీర రెంతభాగ్యవంతులో

(||pallavi||)
āligi maganigini amarĕnu valabulu
vālāyabu pŏṁdu liḍuvalĕ nuṁḍavaladā

(||āli||)
yīḍujŏḍai tamalona yĕggudappu lĕṁchugoru
āḍu kolu māḍalu avi yĕṭṭivo
vāḍigasaṁtosālu vadala rĕṁtai nānu
veḍugam̐ gūḍinayaṭṭiveḽa lĕḍuvaṁṭivo

(||āli||)
sarasamulāḍugŏṁṭā jaṁṭavāya rĕnnam̐ḍunu
iravainabŏṁtanālu yĕṭṭu gūḍĕno
marigi yŏgarŏgaru manasula nĕm̐tainānu
yĕrabariga mĕṟam̐ga reminomu nom̐siro

(||āli||)
vemāru radulam̐ gūḍi vīsamaṁtā nalayaru
premado nesaginānam̐ bĕṁḍlāḍiro
āmuga śhrīveṁkaḍeśhum̐ ḍalu melumaṁga yīgĕ
yemiḍā nŏddigamīra rĕṁtabhāgyavaṁtulo