Aaligi maganigi siggamta sellunaa

ఆలికి మగనికి సిగ్గంత చెల్లునా
Language

(॥పల్లవి॥)
ఆలికి మగనికి సిగ్గంత చెల్లునా
మేలుమీఁదివాఁడవు మెచ్చఁగద వోయి

(॥ఆలి॥)
భాపములో బయలీఁత పాదపునేలల వాఁత
యీపలఁ గంటివా వోయి యీపెవల్లను
నీవద్ద నుండే నీతోఁ బలికేబాస
చేవదేరీ నీకెవల్లఁ జిత్తగించ వోయి

(॥ఆలి॥)
కన్నుల నీమీఁదిచూపు కాఁకలలో తరితీపు
చెన్ను మీరె నిది దెలిసితివా వోయి
మున్నిటి మాటలపొందు మోవిపై తేనెల విందు
సన్నల నీకీపెఁ జూపీఁ జన వియ్యవోయి

(॥ఆలి॥)
విరహపుపసివాడు వెలయ నీతో జోడు
గరిమ నబ్బెనా యీకేకాఁగిట నోయి
నిరతి శ్రీ వేంకటేశ నేఁడు నన్నుఁ గూడితివి
సరివచ్చేనా రతి జాడల నోయి

(||pallavi||)
āligi maganigi siggaṁta sĕllunā
melumīm̐divām̐ḍavu mĕchcham̐gada voyi

(||āli||)
bhābamulo bayalīm̐ta pādabunelala vām̐ta
yībalam̐ gaṁṭivā voyi yībĕvallanu
nīvadda nuṁḍe nīdom̐ baligebāsa
sevaderī nīgĕvallam̐ jittagiṁcha voyi

(||āli||)
kannula nīmīm̐disūbu kām̐kalalo taridību
sĕnnu mīrĕ nidi dĕlisidivā voyi
munniḍi māḍalabŏṁdu movibai tenĕla viṁdu
sannala nīgībĕm̐ jūbīm̐ jana viyyavoyi

(||āli||)
virahabubasivāḍu vĕlaya nīdo joḍu
garima nabbĕnā yīgegām̐giḍa noyi
niradi śhrī veṁkaḍeśha nem̐ḍu nannum̐ gūḍidivi
sarivachchenā radi jāḍala noyi