Aali magani tagavulavigo seppidi neegu

ఆలి మగని తగవులవిగో చెప్పితి నీకు
Language

(॥పల్లవి॥)
ఆలి మగని తగవులవిగో చెప్పితి నీకు
వాలాయముగా మఱవక తలఁచుకొమ్మీ

(॥ఆలి॥)
యెడసిన తమితోడ నెంతయినా సొలతురు
పడఁతులయ్యినవారు పతిని
అడరి నీవు రావలెనని చెలికత్తెలచే
యెడ మాఁటల దూరితి నెగ్గుపట్టేవు సుమ్మీ

(॥ఆలి॥)
కాఁకఁ బొరలినందుకు కైమీరి చెనకుదురు
యేఁకరిన సతులు త మ్మేలినవాని
తేఁకువతో నీవు నన్ను దిష్టించి చూడవలసి
పోఁక పూఁబిలవేసితి పొంచి వోరుచుకొమ్మీ

(॥ఆలి॥)
అంచెలఁ గూడేటి వేళ అట్టె యేమైనాఁ జేతురు
పొంచుకున్న వనితలు పొందైనవాని
యెంచఁగ శ్రీవేంకటేశ యెనసేవేళ నీ మోవి
యించుక గంటిసేసితి నేమీ ననకుమీ

(||pallavi||)
āli magani tagavulavigo sĕppidi nīgu
vālāyamugā maṟavaga talam̐sugŏmmī

(||āli||)
yĕḍasina tamidoḍa nĕṁtayinā sŏladuru
paḍam̐tulayyinavāru padini
aḍari nīvu rāvalĕnani sĕligattĕlase
yĕḍa mām̐ṭala dūridi nĕggubaṭṭevu summī

(||āli||)
kām̐kam̐ bŏralinaṁdugu kaimīri sĕnaguduru
yem̐karina sadulu ta mmelinavāni
tem̐kuvado nīvu nannu diṣhṭiṁchi sūḍavalasi
pom̐ka pūm̐bilavesidi pŏṁchi vorusugŏmmī

(||āli||)
aṁchĕlam̐ gūḍeḍi veḽa aṭṭĕ yemainām̐ jeduru
pŏṁchugunna vanidalu pŏṁdainavāni
yĕṁcham̐ga śhrīveṁkaḍeśha yĕnaseveḽa nī movi
yiṁchuga gaṁṭisesidi nemī nanagumī