Aali magani samdigi naddamunnadaa

ఆలి మగని సందికి నడ్డమున్నదా
Language

(॥పల్లవి॥)
ఆలి మగని సందికి నడ్డమున్నదా
మేలములాడఁ గదవె మేకు లేఁటికి

(॥॥)
తలవంచుకొననేల దండనే కూచున్నవాఁడు
చెలువునిఁ జూడఁగదే సిగ్గులేఁటికి
వలవనిమోనమేల వచ్చీ తా వేడుకపడి
పలుకఁ గదవే వట్టి పంతమేఁటికి

(॥॥)
సన్నలుఁ జాయలునేల సమ్మతించి వున్నవాఁ డు
విన్నవించఁ గదవే నివ్వెర గేఁటికి
యెన్నిక లింతేనేల యింటిలోనికిఁ బిలిచి
చన్నుల నొ త్తఁగదవే జాగు లేఁటికి

(॥॥)
వొరయఁగ నిఁకనేలే వొడివట్టుకున్నవాఁడు
గొరబుగా నవ్వఁగదే కొసరేఁటికి
ఇరవై శ్రీ వేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
సరిమో వియ్యఁ గదవె సాములేఁటికి

(||pallavi||)
āli magani saṁdigi naḍḍamunnadā
melamulāḍam̐ gadavĕ megu lem̐ṭigi

(||||)
talavaṁchugŏnanela daṁḍane kūsunnavām̐ḍu
sĕluvunim̐ jūḍam̐gade siggulem̐ṭigi
valavanimonamela vachchī tā veḍugabaḍi
palugam̐ gadave vaṭṭi paṁtamem̐ṭigi

(||||)
sannalum̐ jāyalunela sammadiṁchi vunnavām̐ ḍu
vinnaviṁcham̐ gadave nivvĕra gem̐ṭigi
yĕnniga liṁtenela yiṁṭilonigim̐ bilisi
sannula nŏ ttam̐gadave jāgu lem̐ṭigi

(||||)
vŏrayam̐ga nim̐kanele vŏḍivaṭṭugunnavām̐ḍu
gŏrabugā navvam̐gade kŏsarem̐ṭigi
iravai śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
sarimo viyyam̐ gadavĕ sāmulem̐ṭigi