Aalarijaanamdavani amtimgaa nenu

ఆలరిజాణఁడవని అంటిఁగా నేను
Language

(॥పల్లవి॥)
ఆలరిజాణఁడవని అంటిఁగా నేను
ఆలనైతి నింత యేఁటికంటిఁగా నేను

(॥ఆల॥)
చేరిచేరి నీవు నాతో సెలవుల నవ్వఁగాను
ఆరు చేతఁ బట్టకుమనంటిఁగా నేను
నేరుపుల మాటలెల్లా నీవు నాతో నాడఁగాను
ఔరా మెచ్చితినని అంటిఁగా నేను

(॥ఆల॥)
సేసవెట్టి యట్లానే చేతులు చాఁచఁగాను
ఆసలఁ బెట్టకుమని అంటిఁగా నేను
లాసి సరసముల నీలాగు లెల్లాఁ జూపఁగాను
ఆసుద్దులు యెరుఁగుదు నంటిఁగా నేను

(॥ఆల॥)
కప్పురము నీ విచ్చి కాఁకలు చల్లార్చఁగాను
అప్పుడే సంతోషించి అంటిఁగా నేను
ముప్పిరి శ్రీ వేంకటేశ ముంచి నన్నుఁ గూడితివి
అప్పణిచ్చుదాఁకానుంటి నంటిఁగా నేను

(||pallavi||)
ālarijāṇam̐ḍavani aṁṭim̐gā nenu
ālanaidi niṁta yem̐ṭigaṁṭim̐gā nenu

(||āla||)
seriseri nīvu nādo sĕlavula navvam̐gānu
āru sedam̐ baṭṭagumanaṁṭim̐gā nenu
nerubula māḍalĕllā nīvu nādo nāḍam̐gānu
aurā mĕchchidinani aṁṭim̐gā nenu

(||āla||)
sesavĕṭṭi yaṭlāne sedulu sām̐sam̐gānu
āsalam̐ bĕṭṭagumani aṁṭim̐gā nenu
lāsi sarasamula nīlāgu lĕllām̐ jūbam̐gānu
āsuddulu yĕrum̐gudu naṁṭim̐gā nenu

(||āla||)
kappuramu nī vichchi kām̐kalu sallārsam̐gānu
appuḍe saṁtoṣhiṁchi aṁṭim̐gā nenu
muppiri śhrī veṁkaḍeśha muṁchi nannum̐ gūḍidivi
appaṇichchudām̐kānuṁṭi naṁṭim̐gā nenu