Aageṟumgu neeveṟumgu damtesi maagananela

ఆకెఱుఁగు నీవెఱుఁగు దంతేసి మాకననేల
Language

(॥పల్లవి॥)
ఆకెఱుఁగు నీవెఱుఁగు దంతేసి మాకననేల
సాకిరి యడిగితేను సముకాన నాడేము

(॥ఆకె॥)
చలములు నీతోను సాదించ నాకేమిటికి
చెరి(లి?) వద్దికిఁ బోరాదా చెప్పీఁగాని
యెలమి నీ వెక్కడనోయేమేమో సేసితివట
కొలఁదితో నవీఁ గొన్ని కొంతగొంత వింటిమి

(॥ఆకె॥)
యెదుటనే మోవిచొప్పు లెత్తంగ మాకేమిటి?
సుదటి నడుగరాదా చూపీఁగాని
చెదరించనేల నీకు ప్రేమ మెందో వున్నదట
అదనఁ బొరుగువారు ఆడఁగానే వింటిమి

(॥ఆకె॥)
వేమారు నిన్ను మాకు వెరసించనేమిటికి
కోమలికి మొక్కరాదా కూడీఁగాని
నేమపుశ్రీవేంకటేశ నీవే యీకె నేలితట
కామిని లిందరునుఁ బొగడఁగా వింటిమి

(||pallavi||)
āgĕṟum̐gu nīvĕṟum̐gu daṁtesi māgananela
sāgiri yaḍigidenu samugāna nāḍemu

(||āgĕ||)
salamulu nīdonu sādiṁcha nāgemiḍigi
sĕri(li?) vaddigim̐ borādā sĕppīm̐gāni
yĕlami nī vĕkkaḍanoyememo sesidivaḍa
kŏlam̐dido navīm̐ gŏnni kŏṁtagŏṁta viṁṭimi

(||āgĕ||)
yĕduḍane movisŏppu lĕttaṁga māgemiḍi?
sudaḍi naḍugarādā sūbīm̐gāni
sĕdariṁchanela nīgu prema mĕṁdo vunnadaḍa
adanam̐ bŏruguvāru āḍam̐gāne viṁṭimi

(||āgĕ||)
vemāru ninnu māgu vĕrasiṁchanemiḍigi
komaligi mŏkkarādā kūḍīm̐gāni
nemabuśhrīveṁkaḍeśha nīve yīgĕ nelidaḍa
kāmini liṁdarunum̐ bŏgaḍam̐gā viṁṭimi