ఆకెనేల వొట్టువెట్టే వది దెలుపమంటాను
(॥పల్లవి॥)
ఆకెనేల వొట్టువెట్టే వది దెలుపమంటాను
పైకొని నీలో నీవే భావించుకోరాదా
(॥ఆకె॥)
నగితే నీదేవుల నానలువెట్టేలడిగేవు
జిగిమించ మరి యేమి చెప్పమనేవు
మగఁడవు నీచేఁతలు మరేమైనాఁ గలితే
తగిలి నీలో నీవే తలఁచుకొరాదా
(॥ఆకె॥)
నీమోము చూచితేనేల నెలఁత కొంగు వట్టేవు
నేమాన నేమి దారుకాణించుమనేవు
యేమైనా నీసుద్దులు యేకడనైనాఁ గలితే
దీమసాన నీలో నీవే తెలుసుకోరాదా
(॥ఆకె॥)
అలమేలుమంగ నిన్ను నంటితే నేల కొంకేవు
యెలమి శ్రీవేంకటేశ యెంతొరసేవు
యిలఁ గూడితివి యింక నేపనులైనాఁ గలితే
వెలయ నీలో నీవే విచారించుకొరాదా
(||pallavi||)
āgĕnela vŏṭṭuvĕṭṭe vadi dĕlubamaṁṭānu
paigŏni nīlo nīve bhāviṁchugorādā
(||āgĕ||)
nagide nīdevula nānaluvĕṭṭelaḍigevu
jigimiṁcha mari yemi sĕppamanevu
magam̐ḍavu nīsem̐talu maremainām̐ galide
tagili nīlo nīve talam̐sugŏrādā
(||āgĕ||)
nīmomu sūsidenela nĕlam̐ta kŏṁgu vaṭṭevu
nemāna nemi dārugāṇiṁchumanevu
yemainā nīsuddulu yegaḍanainām̐ galide
dīmasāna nīlo nīve tĕlusugorādā
(||āgĕ||)
alamelumaṁga ninnu naṁṭide nela kŏṁkevu
yĕlami śhrīveṁkaḍeśha yĕṁtŏrasevu
yilam̐ gūḍidivi yiṁka nebanulainām̐ galide
vĕlaya nīlo nīve visāriṁchugŏrādā