Aagene po ne nadige namdarilona

ఆకెనే పో నే నడిగే నందరిలోన
Language

(॥పల్లవి॥)
ఆకెనే పో నే నడిగే నందరిలోన
యేకతాన నిన్ను భ్రమయించెఁగా విభుఁడా

(॥ఆకెనే॥)
సారెఁ దురుమొకచేతఁ జక్కఁ బెట్టుకొంటానే
వోరగండ్లనే చూచె నొకలేమ
గీరుఁ దిరుమణి గోరఁ గెరలి దిద్దుకొంటానే
ఆరయ నీతో మాటలాడెఁగా విభుఁడా

(॥ఆకెనే॥)
చెచ్చెర నుద్దాలు మెట్టి చెలిపై నొరగుకొని
అచ్చనాడె నిమ్మపండ్లు ఆ యింతి
కుచ్చుముత్యాలపయ్యదకొంగు ముంజేతఁ జుట్టుక
వెచ్చనూరుపుల నిన్ను విసరెఁగా విభుఁడా

(॥ఆకెనే॥)
ఆడపచెలు లిచ్చేటి ఆకు చేత నందుకొంటా
వెడవెడగా నవ్వె వెలఁది నీతో
నడుమ శ్రీవేంకటేశ ననుఁ గూడితివి యీడ
నోడిగించ నా పేరు మోచ్చెఁగా విభుఁడా

(||pallavi||)
āgĕne po ne naḍige naṁdarilona
yegadāna ninnu bhramayiṁchĕm̐gā vibhum̐ḍā

(||āgĕne||)
sārĕm̐ durumŏgasedam̐ jakkam̐ bĕṭṭugŏṁṭāne
voragaṁḍlane sūsĕ nŏgalema
gīrum̐ dirumaṇi goram̐ gĕrali diddugŏṁṭāne
āraya nīdo māḍalāḍĕm̐gā vibhum̐ḍā

(||āgĕne||)
sĕchchĕra nuddālu mĕṭṭi sĕlibai nŏragugŏni
achchanāḍĕ nimmabaṁḍlu ā yiṁti
kuchchumutyālabayyadagŏṁgu muṁjedam̐ juṭṭuga
vĕchchanūrubula ninnu visarĕm̐gā vibhum̐ḍā

(||āgĕne||)
āḍabasĕlu lichcheḍi āgu seda naṁdugŏṁṭā
vĕḍavĕḍagā navvĕ vĕlam̐di nīdo
naḍuma śhrīveṁkaḍeśha nanum̐ gūḍidivi yīḍa
noḍigiṁcha nā peru mochchĕm̐gā vibhum̐ḍā