Aagem biluvavayyaa yichchadigini

ఆకెఁ బిలువవయ్యా యిచ్చటికిని
Language

(॥పల్లవి॥)
ఆకెఁ బిలువవయ్యా యిచ్చటికిని
కాకరిపను లడుగఁగవలె నిఁకను

(॥॥)
నునుపులమాఁటలు నాతోనాడఁగ
కనుగొని నవ్వీఁగడ నొకతె
యెనయఁగ నీగుణ మేమిదెలిసెనో
వెనకటిపను లవి వినవలె నిఁకను

(॥॥)
సరసముతో నాసరులు దిద్దఁగా
కెరలుచు నటు గొణఁగీ నొకతె
ధర నీ సేఁతలు తానేమెఱుఁగునో
గరిమ లన్నియునుఁ గనవలె నిఁకను

(॥॥)
కందువతో ననుఁ గాఁగిలించగా
చెంది సన్న సేసీ నొకతె
యిందునె శ్రీవేంకటేశ కూడితివి
చందము లిటు మెచ్చఁగవలె నిఁకను

(||pallavi||)
āgĕm̐ biluvavayyā yichchaḍigini
kāgaribanu laḍugam̐gavalĕ nim̐kanu

(||||)
nunubulamām̐ṭalu nādonāḍam̐ga
kanugŏni navvīm̐gaḍa nŏgadĕ
yĕnayam̐ga nīguṇa memidĕlisĕno
vĕnagaḍibanu lavi vinavalĕ nim̐kanu

(||||)
sarasamudo nāsarulu diddam̐gā
kĕralusu naḍu gŏṇam̐gī nŏgadĕ
dhara nī sem̐talu tānemĕṟum̐guno
garima lanniyunum̐ ganavalĕ nim̐kanu

(||||)
kaṁduvado nanum̐ gām̐giliṁchagā
sĕṁdi sanna sesī nŏgadĕ
yiṁdunĕ śhrīveṁkaḍeśha kūḍidivi
saṁdamu liḍu mĕchcham̐gavalĕ nim̐kanu