Aagegunu neegum baayani suttarigamugana

ఆకెకును నీకుఁ బాయని చుట్టరికముగన
Language

(॥పల్లవి॥)
ఆకెకును నీకుఁ బాయని చుట్టరికముగన
చేకొందు విప్పుడే విచ్చేయవయ్యా

(॥ఆకె॥)
ధరఁ గొలని తామరలు తమనుఁ డుదయంబైన
విరివిఁ జెఁగలించి వికసించును
తెరవముఖకమలమైతే నీవు రాకుంటే
వెరవార నాయకుఁడ వికసించదు

(॥ఆకె॥)
సంతతముఁ గలువ లివి చందురుని రాకలకు
వింతగాఁ బై పై నే వికసించును
యింతియీకనుఁగన లివియైతే నీవదన
కాంతిచంద్రుఁడు రాక కడువిరియవు

(॥ఆకె॥)
మినుకు మయూరములు మేఘోదయంబైన
తనయిచ్చ వేడుకల తగనాడును
యెనలేని శ్రీవేంకటేశ యిటువలె నేఁడు
వనితఁ గూడకయున్న వహికెక్కడు

(||pallavi||)
āgĕgunu nīgum̐ bāyani suṭṭarigamugana
segŏṁdu vippuḍe vichcheyavayyā

(||āgĕ||)
dharam̐ gŏlani tāmaralu tamanum̐ ḍudayaṁbaina
virivim̐ jĕm̐galiṁchi vigasiṁchunu
tĕravamukhagamalamaide nīvu rāguṁṭe
vĕravāra nāyagum̐ḍa vigasiṁchadu

(||āgĕ||)
saṁtadamum̐ galuva livi saṁduruni rāgalagu
viṁtagām̐ bai pai ne vigasiṁchunu
yiṁtiyīganum̐gana liviyaide nīvadana
kāṁtisaṁdrum̐ḍu rāga kaḍuviriyavu

(||āgĕ||)
minugu mayūramulu meghodayaṁbaina
tanayichcha veḍugala taganāḍunu
yĕnaleni śhrīveṁkaḍeśha yiḍuvalĕ nem̐ḍu
vanidam̐ gūḍagayunna vahigĕkkaḍu