Aagegu neegum delusu naubhaleshaa

ఆకెకు నీకుఁ దెలుసు నౌభళేశా
Language

(॥పల్లవి॥)
ఆకెకు నీకుఁ దెలుసు నౌభళేశా
యేకతాననే యరసి యెఱుఁగుకో రాదా

(॥॥)
యెదురుఁ గొండలెక్కి యేటి కొల కే మమ్మ
అదిగో సొలసి మాటలాడీ నిన్ను
పొదిగి పొదిగి యట్టే బొమ్మల జంకించు కొంటా
తుదలేని వేడుకలఁ దొంగి చూచీని

(॥॥)
చల్లని మాకులనీడ సమదిష్టితో నీకు
వొల్లని ప్రియాలు చెప్పి వొరసీ నిన్ను
తెల్లమిగా సెలవులఁ దెగ నవ్వు నవ్వుకొంటా
పల్లదాన నీపైఁ బూబంతి వేసీని

(॥॥)
మిక్కుటపుఁ దమకము మించఁగా నీ తొడ యెక్కి
గక్కునఁ జన్నుల నొత్తి కలసీ నీతో
తక్కక యహోబలానఁ దగ శ్రీ వేంకటాద్రిని
వొక్కటై నిన్నుఁ బెండ్లాడి వొద్దికె చూపీని

(||pallavi||)
āgĕgu nīgum̐ dĕlusu naubhaḽeśhā
yegadānane yarasi yĕṟum̐gugo rādā

(||||)
yĕdurum̐ gŏṁḍalĕkki yeḍi kŏla ke mamma
adigo sŏlasi māḍalāḍī ninnu
pŏdigi pŏdigi yaṭṭe bŏmmala jaṁkiṁchu kŏṁṭā
tudaleni veḍugalam̐ dŏṁgi sūsīni

(||||)
sallani māgulanīḍa samadiṣhṭido nīgu
vŏllani priyālu sĕppi vŏrasī ninnu
tĕllamigā sĕlavulam̐ dĕga navvu navvugŏṁṭā
palladāna nībaim̐ būbaṁti vesīni

(||||)
mikkuḍabum̐ damagamu miṁcham̐gā nī tŏḍa yĕkki
gakkunam̐ jannula nŏtti kalasī nīdo
takkaga yahobalānam̐ daga śhrī veṁkaḍādrini
vŏkkaḍai ninnum̐ bĕṁḍlāḍi vŏddigĕ sūbīni