ఆకెకు నీకుఁ దెలుసు నన్నిపనులు
(॥పల్లవి॥)
ఆకెకు నీకుఁ దెలుసు నన్నిపనులు
యీ కడ మమ్ము నట్టె యేమి చూచేవయ్యా
(॥ఆకె॥)
కతకఱచిన మాట కలికి నీతో నాడె
యితవుగా నవ్వితిని ఇందుకు నీవు
రతికెక్కితిరి మీరు రచ్చల నిన్నిటా నేఁడు
చతురత మమ్ము నేమి సారెఁ జూచేవయ్యా
(॥ఆకె॥)
సేయరాని చేఁత నీ చెక్కుల నట్టె సేసె
చాయలకు నీవవి సమ్మతించితి
బాయిటఁ బడెను మీ పై పై వలపులెల్లా
మీయెడ నీవు మమ్ము నేమి చూచేవయ్యా
(॥ఆకె॥)
కనురెప్ప మఱఁగైతే కాఁగిలించుకొనె నాపె
మనసిచ్చి, కరఁగె నీ మర్మములు
ననిచి శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి యిట్టె
యినుమడించెను మోహ మేమి చూచేవయ్యా
(||pallavi||)
āgĕgu nīgum̐ dĕlusu nannibanulu
yī kaḍa mammu naṭṭĕ yemi sūsevayyā
(||āgĕ||)
kadagaṟasina māḍa kaligi nīdo nāḍĕ
yidavugā navvidini iṁdugu nīvu
radigĕkkidiri mīru rachchala ninniḍā nem̐ḍu
sadurada mammu nemi sārĕm̐ jūsevayyā
(||āgĕ||)
seyarāni sem̐ta nī sĕkkula naṭṭĕ sesĕ
sāyalagu nīvavi sammadiṁchidi
bāyiḍam̐ baḍĕnu mī pai pai valabulĕllā
mīyĕḍa nīvu mammu nemi sūsevayyā
(||āgĕ||)
kanurĕppa maṟam̐gaide kām̐giliṁchugŏnĕ nābĕ
manasichchi, karam̐gĕ nī marmamulu
nanisi śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi yiṭṭĕ
yinumaḍiṁchĕnu moha memi sūsevayyā