Aagegu neegum delusu naamugonna tagavula

ఆకెకు నీకుఁ దెలుసు నాముకొన్న తగవుల
Language

(॥పల్లవి॥)
ఆకెకు నీకుఁ దెలుసు నాముకొన్న తగవుల
దాకొన్న సిగ్గును మతి దలఁచ దేమియును

(॥ఆకె॥)
ఇంతి కెంతచనవు నీ విచ్చితివో కాని నీతో
మంతనానఁ దానొక్కతే మాటలాడీని
వంతుల సవతులెల్లా వాకిటనే వుండఁగాను
వింతలుగాఁ దమిరేఁచి వీడె మిచ్చీని

(॥ఆకె॥)
మగువ నెట్ల నీవు మరిగించుకొంటివో
బగి వాయ దెపుడు నీపానుపుమీఁద
నగుతా నూడిగానకు నాతులు గాచుకుండఁగా
పగటుఁ జప్పుడుతోడ పాదము లొత్తీని

(॥ఆకె॥)
మానినికి నెటువంటి మాట పట్టు సేసితివో
తానకమై నిన్ను లోన దాఁచుకున్నది
వూని దయతోడ నిన్ను నొనఁగూర్చె నందరిని
ఆనుక శ్రీవేంకటేశ అట్టె తానూఁ గూడీని

(||pallavi||)
āgĕgu nīgum̐ dĕlusu nāmugŏnna tagavula
dāgŏnna siggunu madi dalam̐sa demiyunu

(||āgĕ||)
iṁti kĕṁtasanavu nī vichchidivo kāni nīdo
maṁtanānam̐ dānŏkkade māḍalāḍīni
vaṁtula savadulĕllā vāgiḍane vuṁḍam̐gānu
viṁtalugām̐ damirem̐si vīḍĕ michchīni

(||āgĕ||)
maguva nĕṭla nīvu marigiṁchugŏṁṭivo
bagi vāya dĕbuḍu nībānubumīm̐da
nagudā nūḍigānagu nādulu gāsuguṁḍam̐gā
pagaḍum̐ jappuḍudoḍa pādamu lŏttīni

(||āgĕ||)
māninigi nĕḍuvaṁṭi māḍa paṭṭu sesidivo
tānagamai ninnu lona dām̐sugunnadi
vūni dayadoḍa ninnu nŏnam̐gūrsĕ naṁdarini
ānuga śhrīveṁkaḍeśha aṭṭĕ tānūm̐ gūḍīni