Aagegu neegum delusu naameemdi suddulellaa

ఆకెకు నీకుఁ దెలుసు నామీఁది సుద్దులెల్లా
Language

(॥పల్లవి॥)
ఆకెకు నీకుఁ దెలుసు నామీఁది సుద్దులెల్లా
చేకొని వాకుచ్చి నీతో చెప్పనేమున్నదిరా

(॥ఆకె॥)
ఆయముసోఁకినమాఁట లప్పుడు నీవాడఁగాను
కాయమెల్లఁ బులకించెఁ గరఁగీ చెలి
చాయ సేసుకొని నీవు సంగడివారి మొరఁగి
మాయలనవ్వు నవ్వేవు మరి నేనేమందురా

(॥ఆకె॥)
కమ్మటి నీవు కడగండ్లనే చూడఁగాను
యెమ్మెలెల్లా నాడదా నీయింతి ఆవేళ
దిమ్మురేఁగి చెలులకుఁ దెలియకుండా నీవు
చిమ్మి పెదవిసన్నలు సేసేవు యేమందురా

(॥ఆకె॥)
అంటిముట్టి యాపెను నీ వరమఱపించఁగాను
నంటులెల్ల నడపదా నమ్మి యీడను
గొంటవై శ్రీవేంకటేశ కూడితి విందుకు నన్నుఁ
జంటలఁ గొసరితేను సాదించే వేమందురా

(||pallavi||)
āgĕgu nīgum̐ dĕlusu nāmīm̐di suddulĕllā
segŏni vāguchchi nīdo sĕppanemunnadirā

(||āgĕ||)
āyamusom̐kinamām̐ṭa lappuḍu nīvāḍam̐gānu
kāyamĕllam̐ bulagiṁchĕm̐ garam̐gī sĕli
sāya sesugŏni nīvu saṁgaḍivāri mŏram̐gi
māyalanavvu navvevu mari nenemaṁdurā

(||āgĕ||)
kammaḍi nīvu kaḍagaṁḍlane sūḍam̐gānu
yĕmmĕlĕllā nāḍadā nīyiṁti āveḽa
dimmurem̐gi sĕlulagum̐ dĕliyaguṁḍā nīvu
simmi pĕdavisannalu sesevu yemaṁdurā

(||āgĕ||)
aṁṭimuṭṭi yābĕnu nī varamaṟabiṁcham̐gānu
naṁṭulĕlla naḍabadā nammi yīḍanu
gŏṁṭavai śhrīveṁkaḍeśha kūḍidi viṁdugu nannum̐
jaṁṭalam̐ gŏsaridenu sādiṁche vemaṁdurā