Aagegu neegum dagu nannidaa mechchidi mimmu

ఆకెకు నీకుఁ దగు నన్నిటా మెచ్చితి మిమ్ము
Language

(॥పల్లవి॥)
ఆకెకు నీకుఁ దగు నన్నిటా మెచ్చితి మిమ్ము
వాకున నేరుపరచి వక్కాణించనేలా

(॥ఆకె॥)
సన్నలా చాయలా నాపె సణఁగులు రాల్చఁగాను
విన్నకన్నయట్టినీకు వేడుక గాదా
వన్నెలాను వాసులాను వలపు నీపైఁ జల్లఁగా
ఇన్నిటా సంతోసము లింకఁ జెప్పనేలా

(॥ఆకె॥)
ఆకడా నీకడా నీతో నాపె పంతాలాడఁగాను
కైకొన్న పతివి నీకు ఘనతగాదా
మేకులకు మెచ్చులకు మేలము నీతో నాడఁగ
జోకగాఁ దరితీపులు చూపిచెప్పనేలా

(॥ఆకె॥)
మునుపావెనకా నీకె మోహించి నిన్నుఁ గూడఁగా
ననుపై నేఁడు నీకు నవ్వులు గావా
ననుఁ గూడితివి నేఁడు నంటున శ్రీవేంకటేశ
వినయాలు పలుమారు వెసఁ జెప్పనేలా

(||pallavi||)
āgĕgu nīgum̐ dagu nanniḍā mĕchchidi mimmu
vāguna nerubarasi vakkāṇiṁchanelā

(||āgĕ||)
sannalā sāyalā nābĕ saṇam̐gulu rālsam̐gānu
vinnagannayaṭṭinīgu veḍuga gādā
vannĕlānu vāsulānu valabu nībaim̐ jallam̐gā
inniḍā saṁtosamu liṁkam̐ jĕppanelā

(||āgĕ||)
āgaḍā nīgaḍā nīdo nābĕ paṁtālāḍam̐gānu
kaigŏnna padivi nīgu ghanadagādā
megulagu mĕchchulagu melamu nīdo nāḍam̐ga
jogagām̐ daridībulu sūbisĕppanelā

(||āgĕ||)
munubāvĕnagā nīgĕ mohiṁchi ninnum̐ gūḍam̐gā
nanubai nem̐ḍu nīgu navvulu gāvā
nanum̐ gūḍidivi nem̐ḍu naṁṭuna śhrīveṁkaḍeśha
vinayālu palumāru vĕsam̐ jĕppanelā