(॥పల్లవి॥)
ఆకెకు నీకుఁ బోవునటవయ్యా
చేకొని నెరులనున్న చిక్కు దీర్చవయ్యా
(॥ఆకె॥)
నలినాక్షి నీ వప్పుడు నవ్వించినప్పటనుండి
యెలిమిఁ దొల్లిటి కోపమెల్ల మానెను
కులికి తనలోపలి గుట్టున నన్నుదిగాని
చలము లేదిఁకను ముచ్చటలాడవయ్యా
(॥ఆకె॥)
ఇంతకి నీవు విడెమిచ్చినయప్పటనుండి
పంతపుటలుకల తాపము మానెను
చెంతల గన్నెరికపు సిగ్గున నున్నది గాని
వంతువాసి గాదు నీవు వద్దికి రావయ్యా
(॥ఆకె॥)
అలమేలుమంగఁ జేతనంటినయప్పటినుండి
సిలుగులెల్లను మానె శ్రీ వేంకటేశ
బలిమి నీవు గూడినపంతాన నున్నది గాని
బెళకు లేదిఁకను నీ ప్రేమ నించవయ్యా
(||pallavi||)
āgĕgu nīgum̐ bovunaḍavayyā
segŏni nĕrulanunna sikku dīrsavayyā
(||āgĕ||)
nalinākṣhi nī vappuḍu navviṁchinappaḍanuṁḍi
yĕlimim̐ dŏlliḍi kobamĕlla mānĕnu
kuligi tanalobali guṭṭuna nannudigāni
salamu ledim̐kanu muchchaḍalāḍavayyā
(||āgĕ||)
iṁtagi nīvu viḍĕmichchinayappaḍanuṁḍi
paṁtabuḍalugala tābamu mānĕnu
sĕṁtala gannĕrigabu sigguna nunnadi gāni
vaṁtuvāsi gādu nīvu vaddigi rāvayyā
(||āgĕ||)
alamelumaṁgam̐ jedanaṁṭinayappaḍinuṁḍi
silugulĕllanu mānĕ śhrī veṁkaḍeśha
balimi nīvu gūḍinabaṁtāna nunnadi gāni
bĕḽagu ledim̐kanu nī prema niṁchavayyā