ఆకెకూ నీకూఁ దెలుసు నన్నివనులును నేఁడు
(॥పల్లవి॥)
ఆకెకూ నీకూఁ దెలుసు నన్నివనులును నేఁడు
యీకడ నింకా సుద్దు లేమడిగే విఁకను
(॥ఆకె॥)
మంతనాన నీ వాడిన మాఁటలు దలఁచుకొని
యింతి చిరునవ్వు నవ్వె నేఁటికోకాని
బంతి నీవూఁ దానూఁ బండే పానుపువంక చూచి
చింతతోడ మేను నిండా చెమటలే కురిసె
(॥ఆకె॥)
పలుమారు నీమీఁది పదములు వాడి వాడి
యెలమి సిగ్గున లోఁగె నేఁటికోకాని
బలువైన నీ గుణాలు పలకపై వాసుకొని
వలపులపులకలు వాములుగా వేసెను
(॥ఆకె॥)
మిక్కుటపు నీ సొమ్ములు మెడనిండాఁ బెట్టుకొని
యిక్కువతో మొక్కు మొక్కె నేఁటికోకాని
ఇక్కడ శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
యెక్కి నీ వురముమీఁద నిన్నిటాను వెలసె
(||pallavi||)
āgĕgū nīgūm̐ dĕlusu nannivanulunu nem̐ḍu
yīgaḍa niṁkā suddu lemaḍige vim̐kanu
(||āgĕ||)
maṁtanāna nī vāḍina mām̐ṭalu dalam̐sugŏni
yiṁti sirunavvu navvĕ nem̐ṭigogāni
baṁti nīvūm̐ dānūm̐ baṁḍe pānubuvaṁka sūsi
siṁtadoḍa menu niṁḍā sĕmaḍale kurisĕ
(||āgĕ||)
palumāru nīmīm̐di padamulu vāḍi vāḍi
yĕlami sigguna lom̐gĕ nem̐ṭigogāni
baluvaina nī guṇālu palagabai vāsugŏni
valabulabulagalu vāmulugā vesĕnu
(||āgĕ||)
mikkuḍabu nī sŏmmulu mĕḍaniṁḍām̐ bĕṭṭugŏni
yikkuvado mŏkku mŏkkĕ nem̐ṭigogāni
ikkaḍa śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
yĕkki nī vuramumīm̐da ninniḍānu vĕlasĕ