ఆకెతో మారువసంత మాడుదువు రావయ్య
(॥పల్లవి॥)
ఆకెతో మారువసంత మాడుదువు రావయ్య
యీకడ నాకడఁ జూచే మెవ్వ రిందు బలువో
(॥॥)
కన్నుల చూపుల నింతి కలువ రేకులు చల్లి
సన్నలనే కప్రాలు సారెఁ జల్లీని
చన్నుల మెఱుఁగులను సరిఁ గుంకుమలు చల్లి
ఇన్నిటా వసంతమాడీ నిదివో నీ మీఁదను
(॥॥)
వేడుకనవ్వు లనే వెన్నెల లెల్లాఁజల్లి
వాడిక మాటలనే వలపు చల్లి
కూడేటి కోరికెలను కుచ్చు ముత్తెములు చల్లి
యీడుగా వసంత మాడీ నిదివో నీమీఁదను
(॥॥)
సమరతి నిట్టూర్పుల జాజరగాలి చల్లి
చెమటఁ బన్నీరు మచ్చికఁ జల్లీని
అమరే శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె
హీమపు వసంతమాడీ నిదివో నీమీఁదను
(||pallavi||)
āgĕdo māruvasaṁta māḍuduvu rāvayya
yīgaḍa nāgaḍam̐ jūse mĕvva riṁdu baluvo
(||||)
kannula sūbula niṁti kaluva regulu salli
sannalane kaprālu sārĕm̐ jallīni
sannula mĕṟum̐gulanu sarim̐ guṁkumalu salli
inniḍā vasaṁtamāḍī nidivo nī mīm̐danu
(||||)
veḍuganavvu lane vĕnnĕla lĕllām̐jalli
vāḍiga māḍalane valabu salli
kūḍeḍi korigĕlanu kuchchu muttĕmulu salli
yīḍugā vasaṁta māḍī nidivo nīmīm̐danu
(||||)
samaradi niṭṭūrbula jājaragāli salli
sĕmaḍam̐ bannīru machchigam̐ jallīni
amare śhrī veṁkaḍeśha alamelumaṁga yīgĕ
hīmabu vasaṁtamāḍī nidivo nīmīm̐danu