Aage vimte nemainaa nanadaa ninnu

ఆకె వింటే నేమైనా ననదా నిన్ను
Language

(॥పల్లవి॥)
ఆకె వింటే నేమైనా ననదా నిన్ను
మేకొని యింతేసి యాల మేర మీరేవు

(॥ఆకె॥)
నవ్వుతాఁ జెలియాడిన ననుపులమాటలెల్లా
యివ్వల నీవీపెకుఁ జెప్పీ(ప్పే) విచ్చకాలకు
నివ్వటిల్లఁ గానుకగా నీ కిచ్చిన కప్పురము
జవ్వనులకెల్లా నేల సారెకుఁ బెట్టేవు

(॥ఆకె॥)
పొంచి యాపె నీమైనిండాఁ బూసినతట్టు పుణుఁగు
యించుకించుకే చెలుల కేల పూసేవు
అంచెల నీమీఁది బత్తినంపిన జాజివిరులు
మించి కొలువుసతులమీఁద నేల చల్లేవు

(॥ఆకె॥)
వింతలుగా నాపె నీకు వేలఁబెట్టిన వుంగర
మింతలోఁ బొరుగువారికేల చూపేవు
కాంత నిన్నుఁ గూడిన యేకాంతము శ్రీ వేంకటేశ
రంతుల నిందరితోడ రవ్వలేల సే సేవు

(||pallavi||)
āgĕ viṁṭe nemainā nanadā ninnu
megŏni yiṁtesi yāla mera mīrevu

(||āgĕ||)
navvudām̐ jĕliyāḍina nanubulamāḍalĕllā
yivvala nīvībĕgum̐ jĕppī(ppe) vichchagālagu
nivvaḍillam̐ gānugagā nī kichchina kappuramu
javvanulagĕllā nela sārĕgum̐ bĕṭṭevu

(||āgĕ||)
pŏṁchi yābĕ nīmainiṁḍām̐ būsinadaṭṭu puṇum̐gu
yiṁchugiṁchuge sĕlula kela pūsevu
aṁchĕla nīmīm̐di battinaṁpina jājivirulu
miṁchi kŏluvusadulamīm̐da nela sallevu

(||āgĕ||)
viṁtalugā nābĕ nīgu velam̐bĕṭṭina vuṁgara
miṁtalom̐ bŏruguvārigela sūbevu
kāṁta ninnum̐ gūḍina yegāṁtamu śhrī veṁkaḍeśha
raṁtula niṁdaridoḍa ravvalela se sevu