Aage vaddanumdagaane amdam goosumdumanevu

ఆకె వద్దనుండగానే అండఁ గూచుండుమనేవు
Language

(॥పల్లవి॥)
ఆకె వద్దనుండగానే అండఁ గూచుండుమనేవు
నీకు వలసితే మరి నెలఁతలు బాఁతే

(॥ఆకె॥)
వూరకుండేవారినేల వొడివట్టవచ్చేవు
చెరి నీతో నవ్వేవారిఁ జెనకరాదా
మేరతోడివూడిగపు మెలుఁతను నన్నంటేవు
బీరపు నీదేవులతోఁ బెనఁగరాదా

(॥ఆకె॥)
తెరలోనివారినేల దిష్టించి చూచేవు
సరసమాడేవారినే సాదించరాదా
పోరుగుననున్ననన్నుఁ బోరచి వెట్టుమనేవు
సరినున్నకాంతమోవి చవిగొనరాదా

(॥ఆకె॥)
కొలువులొనున్నవారికొప్పేల దువ్వేవు
లలి నమేల్మంగనే లాలించరాదా
చెలికత్తెనైననన్ను శ్రీవేంకటేశ కూడేవు
అలమి వురమాపెనే యాదరించరాదా

(||pallavi||)
āgĕ vaddanuṁḍagāne aṁḍam̐ gūsuṁḍumanevu
nīgu valaside mari nĕlam̐talu bām̐te

(||āgĕ||)
vūraguṁḍevārinela vŏḍivaṭṭavachchevu
sĕri nīdo navvevārim̐ jĕnagarādā
meradoḍivūḍigabu mĕlum̐tanu nannaṁṭevu
bīrabu nīdevuladom̐ bĕnam̐garādā

(||āgĕ||)
tĕralonivārinela diṣhṭiṁchi sūsevu
sarasamāḍevārine sādiṁcharādā
porugunanunnanannum̐ borasi vĕṭṭumanevu
sarinunnagāṁtamovi savigŏnarādā

(||āgĕ||)
kŏluvulŏnunnavārigŏppela duvvevu
lali namelmaṁgane lāliṁcharādā
sĕligattĕnainanannu śhrīveṁkaḍeśha kūḍevu
alami vuramābĕne yādariṁcharādā