ఆకె చక్కఁదనము చూచట్టె నీవు భ్రమసితి
(॥పల్లవి॥)
ఆకె చక్కఁదనము చూచట్టె నీవు భ్రమసితి
దాకొని చనవు లిచ్చి దండకు రారాదా
(॥ఆకె॥)
చెక్కుల చెమట గార చేతులెత్తి మొక్కీ నాపె
యెక్కడ పరాకై చూచే వేమయ్య నీవు
మొక్కలపుతేనె గార మోవినే విందులు చెప్పీ
ఇక్కువ నీ వెరింగి యియ్యకొనరాదా
(॥ఆకె॥)
కరఁగి కరఁగి చూచి కన్నులనే మేలు చల్లి
మరగీ నీకేమిటికి మంతనములు
శిరసువంచి నవ్వుల సిగ్గులకానుకలిచ్చీ
సరసతలను చేయిచాఁచఁగరాదా
(॥ఆకె॥)
ఆయములు సోఁకించి అట్టె కాఁగిట నించీ
పాయపుమదాన, నేల పలుకవిట్టె
చాయల శ్రీవేంకటేశ సతి నిన్ను దక్కఁగొనె
దాయివెట్టి రతెలెల్లా తలఁచుకోరాదా
(||pallavi||)
āgĕ sakkam̐danamu sūsaṭṭĕ nīvu bhramasidi
dāgŏni sanavu lichchi daṁḍagu rārādā
(||āgĕ||)
sĕkkula sĕmaḍa gāra sedulĕtti mŏkkī nābĕ
yĕkkaḍa parāgai sūse vemayya nīvu
mŏkkalabudenĕ gāra movine viṁdulu sĕppī
ikkuva nī vĕriṁgi yiyyagŏnarādā
(||āgĕ||)
karam̐gi karam̐gi sūsi kannulane melu salli
maragī nīgemiḍigi maṁtanamulu
śhirasuvaṁchi navvula siggulagānugalichchī
sarasadalanu seyisām̐sam̐garādā
(||āgĕ||)
āyamulu som̐kiṁchi aṭṭĕ kām̐giḍa niṁchī
pāyabumadāna, nela palugaviṭṭĕ
sāyala śhrīveṁkaḍeśha sadi ninnu dakkam̐gŏnĕ
dāyivĕṭṭi radĕlĕllā talam̐sugorādā