Aage ninnemi sesinaa namdu kemayya

ఆకె నిన్నేమి సేసినా నందు కేమయ్య
Language

(॥పల్లవి॥)
ఆకె నిన్నేమి సేసినా నందు కేమయ్య
చేకొన నీ కవియల్లాఁ జెప్పుకొనఁ గొత్తలు

(॥ఆకె॥)
యిచ్చకమైనసతి యేమి మాఁటలాడినాను
విచ్చనవిడిఁ బతికి వేడుకై యుండు
పచ్చిగాఁ బెనఁగి మరి పాదము సోఁకించినాను
మచ్చికలు రేఁగి రేఁగి మర్మాలు గరఁగును

(॥ఆకె॥)
పొందులయాకె యెంత బొమ్మల జంకించినాను
అంది నీకు సంతోసములై యుండును
కందువ నీకంటె నాపె గనముగఁ జెనకిన
సందుకొన నీకు నవి చవులై మెరమున

(॥ఆకె॥)
అలమేలుమంగ నిన్ను నాసతోఁ గాఁగిలించఁగా
నిలువెల్లఁ బులకలు నిండును నీకు
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
సలిగెలాపెరతి సమ్మతులై మించును

(||pallavi||)
āgĕ ninnemi sesinā naṁdu kemayya
segŏna nī kaviyallām̐ jĕppugŏnam̐ gŏttalu

(||āgĕ||)
yichchagamainasadi yemi mām̐ṭalāḍinānu
vichchanaviḍim̐ badigi veḍugai yuṁḍu
pachchigām̐ bĕnam̐gi mari pādamu som̐kiṁchinānu
machchigalu rem̐gi rem̐gi marmālu garam̐gunu

(||āgĕ||)
pŏṁdulayāgĕ yĕṁta bŏmmala jaṁkiṁchinānu
aṁdi nīgu saṁtosamulai yuṁḍunu
kaṁduva nīgaṁṭĕ nābĕ ganamugam̐ jĕnagina
saṁdugŏna nīgu navi savulai mĕramuna

(||āgĕ||)
alamelumaṁga ninnu nāsadom̐ gām̐giliṁcham̐gā
niluvĕllam̐ bulagalu niṁḍunu nīgu
yĕlami śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
saligĕlābĕradi sammadulai miṁchunu