Aaduvaari kimtalomge vademiraa

ఆడువారి కింతలోఁగే వదేమిరా
Language

(॥పల్లవి॥)
ఆడువారి కింతలోఁగే వదేమిరా
నేఁడు నాఁడు నొక్కఁడవు నీవే కదరా

(॥॥)
నవ్వుతా గోర నిటంటే నాఁటెనంటాఁ గోపించేవు
ఇవ్వల రాకాసికయ్యా లెట్టునేసితో
పువ్వుల వేయఁబూఁచితేఁ బొరిఁ దప్పించుకొనేవు
రవ్వైననీబిరుదెల్లా రతికెక్కెరా

(॥॥)
వెలయఁ గొంగు పట్టితే విడుమంటాఁ బెనఁగేవు
యెలమి రోలఁగట్టితే నెట్టుంటివో
చిలికిన పన్నీటి జిగి నుడ్డుకుడిచేవు
పలు జలధుల నెట్టు పవ్వళించితివిరా

(॥॥)
సరి నన్నొకతెఁ గూడి సదమదమైతి విట్టె
యిరవై పదారువేల నెట్టు గూడితో
అరయ శ్రీవేంకటేశ అన్నిటా నన్నేలితివి
పరగ నాతోనే నీకు బలిమి చెల్లదురా

(||pallavi||)
āḍuvāri kiṁtalom̐ge vademirā
nem̐ḍu nām̐ḍu nŏkkam̐ḍavu nīve kadarā

(||||)
navvudā gora niḍaṁṭe nām̐ṭĕnaṁṭām̐ gobiṁchevu
ivvala rāgāsigayyā lĕṭṭunesido
puvvula veyam̐būm̐sidem̐ bŏrim̐ dappiṁchugŏnevu
ravvainanībirudĕllā radigĕkkĕrā

(||||)
vĕlayam̐ gŏṁgu paṭṭide viḍumaṁṭām̐ bĕnam̐gevu
yĕlami rolam̐gaṭṭide nĕṭṭuṁṭivo
siligina pannīḍi jigi nuḍḍuguḍisevu
palu jaladhula nĕṭṭu pavvaḽiṁchidivirā

(||||)
sari nannŏgadĕm̐ gūḍi sadamadamaidi viṭṭĕ
yiravai padāruvela nĕṭṭu gūḍido
araya śhrīveṁkaḍeśha anniḍā nannelidivi
paraga nādone nīgu balimi sĕlladurā