ఆతుర(మ?)బందుగుఁడవు అన్నిటా నాకు
(॥పల్లవి॥)
ఆతుర(మ?)బందుగుఁడవు అన్నిటా నాకు
యీతల నున్నాఁడవుగా యెప్పుడైనాను
(॥ఆతు॥)
తలఁగి నీరాక గోరి దప్పిఁ బొరలేటివేళఁ
గలవుగా యిప్పుడైనాఁ గప్పురమీయ్య
జలజలఁ జెమరించి సదమదమై యుండగా
వెలినుండి వచ్చితిగా విసరనైనా
(॥ఆతు॥)
చేరి నిన్నుఁ దలఁచుక చింతతోడ నుండఁగాను
నీరూపు చూపితివిగా నేఁడైనాను
ఆరీతి నిట్టూరుపుల నసురుసురై వుండఁగా
గారవించి స్వస్తపెట్టి కందువ నిల్తువుగా
(॥ఆతు॥)
నీకుఁగా నెదురుచూచి నవ్వెరగై వుండఁగాను
కైకొని శ్రీవేంకటేశ కలసితివి
యీకడ నలమేల్మంగ నిటు సేవసేయఁగా
మేకొని యిప్పుడు నన్ను మెత్తువుగా నీవు
(||pallavi||)
ādura(ma?)baṁdugum̐ḍavu anniḍā nāgu
yīdala nunnām̐ḍavugā yĕppuḍainānu
(||ādu||)
talam̐gi nīrāga gori dappim̐ bŏraleḍiveḽam̐
galavugā yippuḍainām̐ gappuramīyya
jalajalam̐ jĕmariṁchi sadamadamai yuṁḍagā
vĕlinuṁḍi vachchidigā visaranainā
(||ādu||)
seri ninnum̐ dalam̐suga siṁtadoḍa nuṁḍam̐gānu
nīrūbu sūbidivigā nem̐ḍainānu
ārīdi niṭṭūrubula nasurusurai vuṁḍam̐gā
gāraviṁchi svastabĕṭṭi kaṁduva nilduvugā
(||ādu||)
nīgum̐gā nĕdurusūsi navvĕragai vuṁḍam̐gānu
kaigŏni śhrīveṁkaḍeśha kalasidivi
yīgaḍa nalamelmaṁga niḍu sevaseyam̐gā
megŏni yippuḍu nannu mĕttuvugā nīvu