Aaduma samtosabettu tadi yeṟuga taa

ఆతుమ సంతోసపెట్టు టది యెఱుక తా
Language

(॥పల్లవి॥)
ఆతుమ సంతోసపెట్టు టది యెఱుక తా-
నే తెరువు వొల్లకుండు టిదియె యెఱుక

(॥ఆతుమ॥)
ముంచిన బంధముల మునుఁగువడక తా
నంచల విడఁ దన్నుటది యెఱుక
చంచలపు విషయాల సగ్గుడు ముగ్గుడు గాక
యెంచి హరిఁ దలపోయు టిదియె యెఱుక

(॥ఆతుమ॥)
పాయని యర్థములకు బంటుబంటై తిరుగక
ఆయితమై మోసపోని దది యెఱుక
పాయపు కామినులతో పలుమారుఁ జేయుపొందు
హేమముగఁ దలపోయు టిదియె యెఱుక

(॥ఆతుమ॥)
ధరమీఁదఁ గల ప్రాణితతుల నొప్పించక
అరయఁగ సముఁడవుట అది యెఱుక
గరిమిల శ్రీవేంకటపతి దాసుఁడై
యిరవొంద సుఖియించు టిదియె యెఱుక

(||pallavi||)
āduma saṁtosabĕṭṭu ṭadi yĕṟuga tā-
ne tĕruvu vŏllaguṁḍu ṭidiyĕ yĕṟuga

(||āduma||)
muṁchina baṁdhamula munum̐guvaḍaga tā
naṁchala viḍam̐ dannuḍadi yĕṟuga
saṁchalabu viṣhayāla sagguḍu mugguḍu gāga
yĕṁchi harim̐ dalaboyu ṭidiyĕ yĕṟuga

(||āduma||)
pāyani yardhamulagu baṁṭubaṁṭai tirugaga
āyidamai mosaboni dadi yĕṟuga
pāyabu kāminulado palumārum̐ jeyubŏṁdu
hemamugam̐ dalaboyu ṭidiyĕ yĕṟuga

(||āduma||)
dharamīm̐dam̐ gala prāṇidadula nŏppiṁchaga
arayam̐ga samum̐ḍavuḍa adi yĕṟuga
garimila śhrīveṁkaḍabadi dāsum̐ḍai
yiravŏṁda sukhiyiṁchu ṭidiyĕ yĕṟuga