ఆడుకొనే నెంతకైనా అందరితోను
(॥పల్లవి॥)
ఆడుకొనే నెంతకైనా అందరితోను
వేడుక నీవు విచ్చనవిడి నుండవయ్యా
(॥ఆడు॥)
మంతనాన నీవు నాతో మాటలాడవా యిప్పుడు
అంతోనే లేదనేవు ఆకెఁ జూచి
వంతులేక నీవొకరివాఁడవా యేమైనాను
ఇంతటిమగవాఁడవు యేల నీకు వెరపు
(॥ఆడు॥)
అండనుండి నాచే విడె మందుకొనవా నీవు
అండుకాచే వప్పటిని ఆకెఁ జూచి
బెండుపడి నీ వొకరిపెట్టుఁజెట్టవా యేమైనా
నిండుదొర వప్పటిని నీకేల వెఱపు
(॥ఆడు॥)
కలసి మెలసి నన్ను కాఁగిలించవా నీవు
ఆలికే వింతటిలోనే యాకెఁ జూచి
చెలఁగి శ్రీవేంకటేశ అలమేల్ మంగపతివి
నెలకొంటి వింతటాను నీకేల వెఱపు
(||pallavi||)
āḍugŏne nĕṁtagainā aṁdaridonu
veḍuga nīvu vichchanaviḍi nuṁḍavayyā
(||āḍu||)
maṁtanāna nīvu nādo māḍalāḍavā yippuḍu
aṁtone ledanevu āgĕm̐ jūsi
vaṁtulega nīvŏgarivām̐ḍavā yemainānu
iṁtaḍimagavām̐ḍavu yela nīgu vĕrabu
(||āḍu||)
aṁḍanuṁḍi nāse viḍĕ maṁdugŏnavā nīvu
aṁḍugāse vappaḍini āgĕm̐ jūsi
bĕṁḍubaḍi nī vŏgaribĕṭṭum̐jĕṭṭavā yemainā
niṁḍudŏra vappaḍini nīgela vĕṟabu
(||āḍu||)
kalasi mĕlasi nannu kām̐giliṁchavā nīvu
ālige viṁtaḍilone yāgĕm̐ jūsi
sĕlam̐gi śhrīveṁkaḍeśha alamel maṁgabadivi
nĕlagŏṁṭi viṁtaḍānu nīgela vĕṟabu