Aadugomgalide jaalu namdarido peddariga

ఆడుకోఁగలితే జాలు నందరితో పెద్దరిక
Language

(॥పల్లవి॥)
ఆడుకోఁగలితే జాలు నందరితో పెద్దరిక-
మేడనైనాఁ దనచిత్త మిట్టట్టనఁ జెల్లునా

(॥ఆడు॥)
మెచ్చినంతే చాలు వాఁడు మీరేమి ననకురే
అచ్చమైన ఇల్లాల నంతే నేను
యిచ్చినంతే చాలుఁ జన వేమనఁగలనే వాని
పచ్చిగా వలచితిని పంత మింకఁ జెల్లునా

(॥ఆడు॥)
నవ్వినంతే చాలుఁ దాను నాయ మేమీ జెప్పకురే
రవ్వపడ్డమేనవావి రమణిని నేను
దవ్వులఁగన్నంతే చాలు తగుఁదగ దనకురే
మువ్వంక మొగమోడితే మొక్కలము చెల్లునా

(॥ఆడు॥)
కొంగు వట్టినంతే చాలు కొప్పు వీడె ననకురే
కుంగనిసిగ్గరి పెండ్లికూఁతుర నేను
అంగవించి శ్రీవేంకటాద్రిపతి నన్నుగూడె
రంగు మీరితిని మచ్చరము లిఁకఁజెల్లునా

(||pallavi||)
āḍugom̐galide jālu naṁdarido pĕddariga-
meḍanainām̐ danasitta miṭṭaṭṭanam̐ jĕllunā

(||āḍu||)
mĕchchinaṁte sālu vām̐ḍu mīremi nanagure
achchamaina illāla naṁte nenu
yichchinaṁte sālum̐ jana vemanam̐galane vāni
pachchigā valasidini paṁta miṁkam̐ jĕllunā

(||āḍu||)
navvinaṁte sālum̐ dānu nāya memī jĕppagure
ravvabaḍḍamenavāvi ramaṇini nenu
davvulam̐gannaṁte sālu tagum̐daga danagure
muvvaṁka mŏgamoḍide mŏkkalamu sĕllunā

(||āḍu||)
kŏṁgu vaṭṭinaṁte sālu kŏppu vīḍĕ nanagure
kuṁganisiggari pĕṁḍligūm̐tura nenu
aṁgaviṁchi śhrīveṁkaḍādribadi nannugūḍĕ
raṁgu mīridini machcharamu lim̐kam̐jĕllunā