Aadinatte aadee veemdu addamulo needavale

ఆడినట్టే ఆడీ వీఁడు అద్దములో నీడవలె
Language

(॥పల్లవి॥)
ఆడినట్టే ఆడీ వీఁడు అద్దములో నీడవలె
జాడతోడ కన్నులనే సన్న సేసీనే

(॥ఆడి॥)
కోరి జలకము కేళాకూళిలో నేనాడఁగాను
ఆరసి తానీఁద వచ్చీనాడకే తాను
తారసిలి సిగ్గుతో నేఁ దామరమొగ్గలంటితే
సారపుఁగమలాలంటాఁ జన్నులంటీనే

(॥ఆడి॥)
చెంది పొదరింటి లోన చీర నేఁగట్టుకోఁగాను
అందిమ్మనీఁ బచ్చడము ఆడనే తాను
కందువ సిగ్గుతో నేను కమ్మఁజిగురు వట్టితే
ముందే నాచిగురుమోవి మోవిఁ బట్టీనే

(॥ఆడి॥)
అలసి నేనొకచోటనారగించఁ గూచుండితే
వలెనంటా నాపొత్తుకు వచ్చీనే తాను
అలరి సిగ్గుతోడ నేనట్టె చేయెత్తి మొక్కితే
యెలమి శ్రీ వేంకటేశుఁడిటుగూడి మొక్కెనే

(||pallavi||)
āḍinaṭṭe āḍī vīm̐ḍu addamulo nīḍavalĕ
jāḍadoḍa kannulane sanna sesīne

(||āḍi||)
kori jalagamu keḽāgūḽilo nenāḍam̐gānu
ārasi tānīm̐da vachchīnāḍage tānu
tārasili siggudo nem̐ dāmaramŏggalaṁṭide
sārabum̐gamalālaṁṭām̐ jannulaṁṭīne

(||āḍi||)
sĕṁdi pŏdariṁṭi lona sīra nem̐gaṭṭugom̐gānu
aṁdimmanīm̐ bachchaḍamu āḍane tānu
kaṁduva siggudo nenu kammam̐jiguru vaṭṭide
muṁde nāsigurumovi movim̐ baṭṭīne

(||āḍi||)
alasi nenŏgasoḍanāragiṁcham̐ gūsuṁḍide
valĕnaṁṭā nābŏttugu vachchīne tānu
alari siggudoḍa nenaṭṭĕ seyĕtti mŏkkide
yĕlami śhrī veṁkaḍeśhum̐ḍiḍugūḍi mŏkkĕne