Aadinaaraayana naagu nabhaya meeve

ఆదినారాయణ నాకు నభయ మీవె
Language

(॥పల్లవి॥)
ఆదినారాయణ నాకు నభయ మీవె
కాదని తప్పులెంచక కరుణానిధీ

(॥ఆది॥)
తుదకెక్క నింద్రియపు దొంగలకుఁ దాపిచ్చితి
యెదుటికి రాఁగా నీ వే మందువో
మదించి నాలో నుండఁగా మఱచితి నే నిన్ను
యిదె కాను కియ్యఁగా నీ వేమందువో

(॥ఆది॥)
పక్కన నీ యాజ్ఞ దోసి పాపము లెల్లాఁ జేసితి
యిక్కడనే మొక్కఁగా నీ వేమందువో
దిక్కు నీ వుండఁగాఁ బరదేవతలఁ గొలిచితి
నెక్కొని రక్షించు మంటే నీ విఁక నేమందువో

(॥ఆది॥)
తొట్టి కామక్రోధాలతో దూరు లెల్లాఁ గట్టుకొంటి
యిట్టె ముద్ర మోచే నంటే నేమందువో
నెట్టన శ్రీవేంకటేశ నీకు నలమేల్మంగకు
గట్టిగా నే లెంక నైతి కరుణిం చేమందువో

(||pallavi||)
ādinārāyaṇa nāgu nabhaya mīvĕ
kādani tappulĕṁchaga karuṇānidhī

(||ādi||)
tudagĕkka niṁdriyabu dŏṁgalagum̐ dābichchidi
yĕduḍigi rām̐gā nī ve maṁduvo
madiṁchi nālo nuṁḍam̐gā maṟasidi ne ninnu
yidĕ kānu kiyyam̐gā nī vemaṁduvo

(||ādi||)
pakkana nī yājña dosi pābamu lĕllām̐ jesidi
yikkaḍane mŏkkam̐gā nī vemaṁduvo
dikku nī vuṁḍam̐gām̐ baradevadalam̐ gŏlisidi
nĕkkŏni rakṣhiṁchu maṁṭe nī vim̐ka nemaṁduvo

(||ādi||)
tŏṭṭi kāmakrodhālado dūru lĕllām̐ gaṭṭugŏṁṭi
yiṭṭĕ mudra mose naṁṭe nemaṁduvo
nĕṭṭana śhrīveṁkaḍeśha nīgu nalamelmaṁgagu
gaṭṭigā ne lĕṁka naidi karuṇiṁ semaṁduvo