Aadimalakshmi yadanigim galugamga

ఆదిమలక్ష్మి యతనికిఁ గలుగఁగ
Language

(॥పల్లవి॥)
ఆదిమలక్ష్మి యతనికిఁ గలుగఁగ
యీ దెస సంపద లిఁక నేమి చెప్పేదమ్మా

(॥ఆది॥)
నెలఁత నీ తురు మిది నిండు నీలపుగని
పలచని నీ మేను పసిఁడిగని
మొలక నీ కనుచూపు ముత్యపురాసులగని
యెలమి నీ పతి కింక నేమి గడమమ్మా

(॥ఆది॥)
వనిత నీ దంతములు వజ్రాలపుట్టుగని
నినుపు నీ గోళ్ళు మాణికపుగని
పెనపు నీ కుచములు పెన్నిధానములగని
యెనము నీ పతి కింక నేమి భాగ్యమమ్మా

(॥ఆది॥)
అతివ నీ కెమ్మోవి అదె పగడాలగని
రతి నీ కౌఁగిలి పెద్ద రసముగని
యితవైన శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ గలసె
అతనిరాజ మెల్లా నమరెఁ గదమ్మా

(||pallavi||)
ādimalakṣhmi yadanigim̐ galugam̐ga
yī dĕsa saṁpada lim̐ka nemi sĕppedammā

(||ādi||)
nĕlam̐ta nī turu midi niṁḍu nīlabugani
palasani nī menu pasim̐ḍigani
mŏlaga nī kanusūbu mutyaburāsulagani
yĕlami nī padi kiṁka nemi gaḍamammā

(||ādi||)
vanida nī daṁtamulu vajrālabuṭṭugani
ninubu nī goḽḽu māṇigabugani
pĕnabu nī kusamulu pĕnnidhānamulagani
yĕnamu nī padi kiṁka nemi bhāgyamammā

(||ādi||)
adiva nī kĕmmovi adĕ pagaḍālagani
radi nī kaum̐gili pĕdda rasamugani
yidavaina śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ galasĕ
adanirāja mĕllā namarĕm̐ gadammā