ఆడేవారి నెఱఁగవు అందాలు సేసుక నీవు
(॥పల్లవి॥)
ఆడేవారి నెఱఁగవు అందాలు సేసుక నీవు
యేడనైనా వెకలివై యెమ్మెలు చూపేవు
(॥ఆడే॥)
అలయక పతితోడ నాడేవు మాఁటలెల్లా
వెలినుండి యాతఁడు వినీనంటాను
కలికితనాల మరిఁ గవకవ నవ్వేవు
పలునీనటనలకు భ్రమసీనంటాను
(॥ఆడే॥)
సారెకు నప్పటి నీవు చన్నుల నొత్తే వతఁడు
వూరకే యెంతవడైనా నోరిచీనంటా
తేరకొనఁ జూచి చూచి తేలించేవు కన్నులను
పేరఁ బెట్టి యాస నీపైఁ బెంచీనంటాను
(॥ఆడే॥)
చేతిమీఁదఁ జేయి వేసి చెనకే వాతని నీవు
కాతరించి నీచేఁతకుఁ గరఁగీనంటా
యీతల శ్రీవేంకటేశుఁ డేలె నన్ను నీవుఁ దరఁ
వాత నాతనిఁ గూడేవు వలచునంటాను
(||pallavi||)
āḍevāri nĕṟam̐gavu aṁdālu sesuga nīvu
yeḍanainā vĕgalivai yĕmmĕlu sūbevu
(||āḍe||)
alayaga padidoḍa nāḍevu mām̐ṭalĕllā
vĕlinuṁḍi yādam̐ḍu vinīnaṁṭānu
kaligidanāla marim̐ gavagava navvevu
palunīnaḍanalagu bhramasīnaṁṭānu
(||āḍe||)
sārĕgu nappaḍi nīvu sannula nŏtte vadam̐ḍu
vūrage yĕṁtavaḍainā norisīnaṁṭā
teragŏnam̐ jūsi sūsi teliṁchevu kannulanu
peram̐ bĕṭṭi yāsa nībaim̐ bĕṁchīnaṁṭānu
(||āḍe||)
sedimīm̐dam̐ jeyi vesi sĕnage vādani nīvu
kādariṁchi nīsem̐tagum̐ garam̐gīnaṁṭā
yīdala śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu nīvum̐ daram̐
vāda nādanim̐ gūḍevu valasunaṁṭānu