ఆడేనంటా వచ్చె నారగించలే దింకా
(॥పల్లవి॥)
ఆడేనంటా వచ్చె నారగించలే దింకా
వాడవార చేడెలాల వనజాక్షుఁ జూపరో
(॥ఆడే॥)
మందనున్నపసులాల మంచిగోపబాలులాల
కందర్పగురుఁడు వచ్చెఁ గంటిరా మీరు
కెందమ్మివనములాల కృష్ణుఁడు యమునలోన
చిందుల నీఁదాడునల చెప్పరో సుద్దులు
(॥ఆడే॥)
గొల్లవారిఇండ్లాల గొందిపాలువెన్నలాల
కొల్లలాడేహరి వచ్చె గొండించరో
చల్లలమ్మేసతులాల సరసపురచ్చలాల
ఇల్లీడ నేడనున్నాఁడో యెఱిఁగించరో
(॥ఆడే॥)
గోవర్ధనముదండ గుంపులపూఁ బొదలాల
కోవిదుఁ డేమి సేసి గుట్టుచూపరో
శ్రీవేంకటాద్రిమీఁదఁ జేరి కంటి మింతలోనె
పూవువలె నెత్తుకొంటి భోంగిచీ నిఁకను
(||pallavi||)
āḍenaṁṭā vachchĕ nāragiṁchale diṁkā
vāḍavāra seḍĕlāla vanajākṣhum̐ jūbaro
(||āḍe||)
maṁdanunnabasulāla maṁchigobabālulāla
kaṁdarbagurum̐ḍu vachchĕm̐ gaṁṭirā mīru
kĕṁdammivanamulāla kṛṣhṇum̐ḍu yamunalona
siṁdula nīm̐dāḍunala sĕpparo suddulu
(||āḍe||)
gŏllavāriiṁḍlāla gŏṁdibāluvĕnnalāla
kŏllalāḍehari vachchĕ gŏṁḍiṁcharo
sallalammesadulāla sarasaburachchalāla
illīḍa neḍanunnām̐ḍo yĕṟim̐giṁcharo
(||āḍe||)
govardhanamudaṁḍa guṁpulabūm̐ bŏdalāla
kovidum̐ ḍemi sesi guṭṭusūbaro
śhrīveṁkaḍādrimīm̐dam̐ jeri kaṁṭi miṁtalonĕ
pūvuvalĕ nĕttugŏṁṭi bhoṁgisī nim̐kanu