ఆడే బొమ్మలు వారు ఆడించే సూత్రము నీవు
(॥పల్లవి॥)
ఆడే బొమ్మలు వారు ఆడించే సూత్రము నీవు
యేడో ఇన్నాళ్లు నేను ఇదెఱఁగనైతిని
(॥ఆడే॥)
నీవు చెప్పినబుద్దుల నెలఁతలు నడవఁగా
ఆవలివారి దూరితి నయ్యా నేను
చేవదేర తాలము చేయి నీచే నుండఁగాను
వేవేలుచోట్లను వెదకితి నేను
(॥ఆడే॥)
కన్నుగీఁటి నీవు వారి కైకొని మొక్కించఁగా
సన్నల వారి దొబ్బితి సాదించి నేను
పన్నినకూఁకటివేరై పారి నీవు వుండఁగాను
వున్నతిఁ గొనలకు నీ రొగ్గి నేఁ బోసితిని
(॥ఆడే॥)
కోరి పెండ్లాడిన పెండ్లి కొడకవు నీవుండఁగా
గారవించితిని వారిఁ గరుణ నేను
యీరీతి నన్ను శ్రీ వేంకటేశ నీవు గూడుండఁగా
కారణ మిందరునంటాఁ గడల మెచ్చితిని
(||pallavi||)
āḍe bŏmmalu vāru āḍiṁche sūtramu nīvu
yeḍo innāḽlu nenu idĕṟam̐ganaidini
(||āḍe||)
nīvu sĕppinabuddula nĕlam̐talu naḍavam̐gā
āvalivāri dūridi nayyā nenu
sevadera tālamu seyi nīse nuṁḍam̐gānu
vevelusoṭlanu vĕdagidi nenu
(||āḍe||)
kannugīm̐ṭi nīvu vāri kaigŏni mŏkkiṁcham̐gā
sannala vāri dŏbbidi sādiṁchi nenu
panninagūm̐kaḍiverai pāri nīvu vuṁḍam̐gānu
vunnadim̐ gŏnalagu nī rŏggi nem̐ bosidini
(||āḍe||)
kori pĕṁḍlāḍina pĕṁḍli kŏḍagavu nīvuṁḍam̐gā
gāraviṁchidini vārim̐ garuṇa nenu
yīrīdi nannu śhrī veṁkaḍeśha nīvu gūḍuṁḍam̐gā
kāraṇa miṁdarunaṁṭām̐ gaḍala mĕchchidini