Aadave vogamaada aayamulu garamgamga

ఆడవే వొకమాట ఆయములు గరఁగఁగ
Language

(॥పల్లవి॥)
ఆడవే వొకమాట ఆయములు గరఁగఁగ
చూడవే శిరసెత్తి చూప నేల సిగ్గులూ

(॥॥)
నిలువునఁ దొలఁకేవి నిండు మదనకళలు
పలుకులఁ గురిసేవి పచ్చితేనెలు
సెలవుల వడిసేవి చిఱునవ్వు వెన్నెలలు
చెలియ నీ కెవ్వరీడే సింగారవతివి

(॥॥)
కన్నులను మలసేవి కారు మెఱుఁగు మించులు
చన్నులఁ దొట్టు కొన్నవి జవ్వనములు
నెన్నుదుట మురిసేవి నెఱినీలపు రంగులు
కన్నియ నీ కెవ్వరీడే కడు మోహనాంగివి

(॥॥)
తొడలఁ బెనఁగొనేవి తోరంపు మెఱుఁగులు
అడుగుల నున్నది సోయగపు టీవి
కడఁగి శ్రీ వేంకటేశు కాంత ననుటే మేలు
పడఁతి నీ కెవ్వ రీడే బహువిలాసినివి

(||pallavi||)
āḍave vŏgamāḍa āyamulu garam̐gam̐ga
sūḍave śhirasĕtti sūba nela siggulū

(||||)
niluvunam̐ dŏlam̐kevi niṁḍu madanagaḽalu
palugulam̐ gurisevi pachchidenĕlu
sĕlavula vaḍisevi siṟunavvu vĕnnĕlalu
sĕliya nī kĕvvarīḍe siṁgāravadivi

(||||)
kannulanu malasevi kāru mĕṟum̐gu miṁchulu
sannulam̐ dŏṭṭu kŏnnavi javvanamulu
nĕnnuduḍa murisevi nĕṟinīlabu raṁgulu
kanniya nī kĕvvarīḍe kaḍu mohanāṁgivi

(||||)
tŏḍalam̐ bĕnam̐gŏnevi toraṁpu mĕṟum̐gulu
aḍugula nunnadi soyagabu ṭīvi
kaḍam̐gi śhrī veṁkaḍeśhu kāṁta nanuḍe melu
paḍam̐ti nī kĕvva rīḍe bahuvilāsinivi