(॥పల్లవి॥)
ఆడవే నేనన్నట్టే ఆతనితోడ
వేడుకకాఁడు దోసము విచారించీనటే
(॥ఆడ॥)
వొక్కయింతికిఁ బుట్టి వొక్కతెకొడుకననే
తక్కరికి నిజములు తనకేడవే
ముక్కు గుట్టించుక తానే మురిసి సిగ్గువడఁడు
యిక్కడ మాతిట్లకు నెగ్గులేల పట్టీనే
(॥ఆడ॥)
పరకాంతలఁ బొంది బ్రహ్మచారి ననుకొన్న
యెరవుల సటకాని నేడ నమ్మేదే
నిరతిఁ జన్నిచ్చుదానినెత్తురు దాగినయట్టి
యెరపరి వీనితోడ నేఁటిచుట్టిరికమే
(॥ఆడ॥)
చెల్లెలి నెత్తుకపోను సెలవిచ్చె మరఁదికి
కొల్లతాపకాఁడు వీనిగుణమేఁటిదే
ఇల్లిదె శ్రీవేంకటేశుఁ డింతలోనే నన్నుఁగూడె
వెల్లవిరులాయ నేఁడు విచారము నేఁటికే
(||pallavi||)
āḍave nenannaṭṭe ādanidoḍa
veḍugagām̐ḍu dosamu visāriṁchīnaḍe
(||āḍa||)
vŏkkayiṁtigim̐ buṭṭi vŏkkadĕgŏḍuganane
takkarigi nijamulu tanageḍave
mukku guṭṭiṁchuga tāne murisi sigguvaḍam̐ḍu
yikkaḍa mādiṭlagu nĕggulela paṭṭīne
(||āḍa||)
paragāṁtalam̐ bŏṁdi brahmasāri nanugŏnna
yĕravula saḍagāni neḍa nammede
niradim̐ jannichchudāninĕtturu dāginayaṭṭi
yĕrabari vīnidoḍa nem̐ṭisuṭṭirigame
(||āḍa||)
sĕllĕli nĕttugabonu sĕlavichchĕ maram̐digi
kŏlladābagām̐ḍu vīniguṇamem̐ṭide
illidĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone nannum̐gūḍĕ
vĕllavirulāya nem̐ḍu visāramu nem̐ṭige