Aadavayya sarigaa nee vaabedo vasamtamu

ఆడవయ్య సరిగా నీ వాపెతో వసంతము
Language

(॥పల్లవి॥)
ఆడవయ్య సరిగా నీ వాపెతో వసంతము
వేడుక నవ్వులలోని వెన్నెల వసంతము

(॥॥)
యెడయక నీమీఁద నింతి కొనచూపుల
వడిఁ జల్లీ వలపుల వసంతము
వుడుకుఁ జెమటలనే వూర్చి కొనగోరఁ జిమ్మీ
కొడిసాగ బఱ్ఱటకొములవసంతము

(॥॥)
గొరబైన మాటలు కుమ్మరించి కుమ్మరించీ
వరుఁస జిరు సిగ్గుల వంతము
సొరిది సరసములఁ జూపి మోపి పెనఁగుచు
సరుగ జాచీ గుబ్బచన్నుల వసంతము

(॥॥)
పొంచి పొంచి కలయుచు బుసకొట్టుసేఁతలనే
వంచీ కౌఁగిటిరతుల వసంతము
యెంచి శ్రీవేంకటేశ నన్నేలితివి ఆకె నీపయి
నించీఁ గలయికలనే నెయ్యపువసంతము

(||pallavi||)
āḍavayya sarigā nī vābĕdo vasaṁtamu
veḍuga navvulaloni vĕnnĕla vasaṁtamu

(||||)
yĕḍayaga nīmīm̐da niṁti kŏnasūbula
vaḍim̐ jallī valabula vasaṁtamu
vuḍugum̐ jĕmaḍalane vūrsi kŏnagoram̐ jimmī
kŏḍisāga baṭraḍagŏmulavasaṁtamu

(||||)
gŏrabaina māḍalu kummariṁchi kummariṁchī
varum̐sa jiru siggula vaṁtamu
sŏridi sarasamulam̐ jūbi mobi pĕnam̐gusu
saruga jāsī gubbasannula vasaṁtamu

(||||)
pŏṁchi pŏṁchi kalayusu busagŏṭṭusem̐talane
vaṁchī kaum̐giḍiradula vasaṁtamu
yĕṁchi śhrīveṁkaḍeśha nannelidivi āgĕ nībayi
niṁchīm̐ galayigalane nĕyyabuvasaṁtamu